'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఇప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద ఫోకస్ చేసిన మేకర్స్ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టనున్నారు.

ముందుగా అన్ని ప్రధాన నగరాల్లో ట్రైలర్ లాంచ్ ఉంటుంది. అదే సమయంలో మీడియాతో ప్రభాస్ కాసేపు ఇంటరాక్ట్ అవుతారు. ముందుగా ట్రైలర్ ని ముంబైలో ఆగస్ట్ 10న విడుదల చేస్తారు. ఆ తరువాత ఆగస్ట్ 11న హైదరాబాద్ లో లాంచ్ చేస్తారు. ఆ తరువాత చెన్నై, కొచ్చి, న్యూఢిల్లీలలో వరుసగా ట్రైలర్ లాంచింగ్ ఉంటుంది.

మళ్లీ ఆగస్ట్ 17నుండి అన్ని రాష్ట్రాల్లో ప్రభాస్ పర్యటించి మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, అలానే కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటాడు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఈ నెల 20న ప్రీరిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఇవి కాకుండా దుబాయ్ లో అత్యంత భారీగా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. బాలీవుడ్ నుండి చాలా మంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

ఆగస్ట్ 29న దుబాయిలో సినిమా ప్రీమియర్ ఉండే ఛాన్స్ ఉంది. బెంగుళూరు అలానే కొన్ని ప్రాంతాల్లో సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. 'సాహో' సినిమా రిలీజైన తరువాత ప్రభాస్ వారం రోజులు లండన్ కి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తరువాత రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా మొదలుపెడతారు.