ప్రస్తుతం ఎక్కడ విన్నా సాహో పేరే వినిపిస్తోంది. అభిమానులు సాహో ఫీవర్ తో ఊగిపోతున్నారు. ప్రభాస్ న నటించిన సినిమా చూసేందుకు అభుమానులు రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు టికెట్ ధర ఎంతైనా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. 

ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ వెబ్ సైట్స్ లో ఇప్పటికే సాహో టికెట్స్ మొత్తం అమ్ముడయ్యాయి. ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ పేటియంలో సాహో చిత్రం సంచలనం సృష్టించింది. పేటియంలో ఏకంగా 10 లక్షల సాహో చిత్ర టికెట్లు అమ్ముడయ్యాయి. 

సాహో చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ప్రభాస్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. 2 వేల కోట్ల రాబరీ చుట్టూ ఈ చిత్ర కథ ఉండబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు.