బాహుబలి'  తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. బాహుబలి విజయంతో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ క్రియేట్‌ అవ్వటంతో సాహోను కూడా అదే స్థాయిలో 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే మూడవ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ప్రస్తుతం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.  

ఆ మధ్యన  విడుదలై ఈ సినిమా మేకింగ్‌ వీడియోకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.  ఈ నేఫద్యంలో  చిత్రం  విడుదల తేదీ ని ఖరారు చేశారు చిత్ర  యూనిట్.  

చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా భారీ వీఎఫ్ఎక్స్ తో రానుంది ఈచిత్రం

ఈ చిత్రం తో పాటు తన 20వ చిత్రం లో కూడా నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈచిత్రం కూడా వచ్చే ఏడాది చివర్లలో ప్రేక్షకులముందుకు రానుంది.