Asianet News TeluguAsianet News Telugu

కొత్త సమస్య: 'సైరా'కు 'సాహో' టాక్  టెన్షన్

అనుకున్నట్లుగానే  'సాహో'  సినిమా వచ్చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోతోందనేది ట్రేడ్ రిపోర్ట్. రివ్యూలు సైతం నెగిటివ్ గానే వచ్చాయి. టాక్ సైతం ప్లాఫ్ అంటూ స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపధ్యంలో భారీ రేట్లు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్దితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.

Saaho flop effect on Sye Raa movie
Author
Hyderabad, First Published Aug 30, 2019, 4:25 PM IST

అనుకున్నట్లుగానే  'సాహో'  సినిమా వచ్చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోతోందనేది ట్రేడ్ రిపోర్ట్. రివ్యూలు సైతం నెగిటివ్ గానే వచ్చాయి. టాక్ సైతం ప్లాఫ్ అంటూ స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపధ్యంలో భారీ రేట్లు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్దితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అది ప్రక్కన పెడితే ఈ సినిమా రిజల్ట్ ప్రభావం మరో భారీ చిత్రం సైరా పై పడనుందని అంటున్నారు.

అక్టోబర్ 2 న అంటే మరో నెల రోజుల్లో రిలీజ్ కు వస్తున్న ఈ చిత్రం సైతం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఎలాగైతే సాహోని రిలీజ్ చేసారో అదే పద్దతిగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు సాహోకు కలెక్షన్ వైజ్ గా డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయితే మాత్రం అంతంత రేట్లు పెట్టి సైరాని తీసుకోవటానికి వెనకాడతారు. ఎందుకంటే బాహుబలి వంటి భారీ చిత్రం తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రానికే పరిస్దితి ఇలా ఉంటే చిరంజీవి లాంటి సీనియర్ హీరోకోసం ఎంత ధైర్యం చేయగలుగుతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  అయితే తెలుగు లో మాత్రం సైరా అంచనాలు హైప్ వేరుగా ఉంటాయి కాబట్టి ఎగ్జిబిటర్లు దీన్ని వేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. 

మరో ప్రక్క బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన యాష్ రాజ్ ఫిలిమ్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో వార్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర విడుదల తేదీగా అక్టోబర్ 2గా ప్రకటించడం జరిగింది. నిజానికి సైరా మూవీ విడుదల తేదీ అక్టోబర్ 2 గా చాలా రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ఐతే వార్ చిత్ర యూనిట్ కూడా అదే తేదీని ప్రకటించడం వలన సైరా చిత్రానికి థియేటర్ల సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా లాంటి చిత్రానికి సరిపడా థియేటర్స్ లభించకపోతే ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై పడుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios