టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో వరల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో కలెక్షన్స్  ని అందుకుంటుందో గాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ వసూళ్లను అందుకుంటుందని చెప్పవచ్చు. సినిమాపై ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అలాగే సినిమా రిలీజ్ ని బట్టి బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ లు సినిమా బిజినెస్ పై లెక్కలు వేస్తున్నారు. 

సాహో సినిమా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. మునుపెన్నడు లేని విధంగా ప్రభాస్ సినిమా షోలు ప్రదర్శించబడనున్నాయి. అయితే మొదటిరోజు ఆంధ్ర - నైజం ఏరియాల్లో సాహో 37కోట్ల వరకు షేర్స్ అందుకోవచ్చని టాక్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 125కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న సాహో మినిమమ్ 130కోట్ల షేర్స్ ని అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క. 

సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇంకా ఈ నెంబర్స్ పెరిగే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 330కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ భారీ పెట్టుబడితో రెడీ చేసిన సినిమా సినిమా టోటల్ గా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.