యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ తో దేశం మొత్తం సినీ అభిమానులు సాహో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సాహో చిత్ర దర్శకుడు సుజిత్ మీడియా సమావేశం నిర్వహించి అనేక విషయాలు పంచుకున్నారు. 

బాహుబలి చిత్రం కంటే ముందుగానే ప్రభాస్ కు ఈ కథ చెప్పినట్లు సుజిత్ తెలిపాడు. సాహో కథ అప్పుడే రెడీ అయిపోయింది. బాహుబలి భారీ విజయం తర్వాత సాహో కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ చిత్రం ద్వారా నాకంటే అనుభవం ఉన్న టెక్నీషియన్లతో పనిచేసే అవకాశం వచ్చింది. 

ఇక సాహో చిత్రం వాయిదా పడడానికి గల కారణాన్ని సుజిత్ వివరించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించేందుకే సాహోని ఆగష్టు 30కి వాయిదా వేశామని సుజిత్ తెలిపాడు. ఆ తర్వాత వినాయక చవితి హాలిడేస్ కూడా వస్తాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆగష్టు 30న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.