సాహో సరికొత్త రికార్డులని నెలకొల్పుతూ తెలుగు సినిమాకు మరో గర్వకారణంగా మారుతోంది. బాలీవుడ్ వర్గాలని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఓ తెలుగు సినిమా 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కడం విశేషం. బాహుబలి తర్వాత మరోసారి అంతటి అనుభూతిని అందించాలని ప్రభాస్ భావించాడు. 

అనుభవం లేని దర్శకుడు అయినప్పటికీ అతడి ప్రతిభ, కథని నమ్మి ప్రభాస్ ఈ భారీ చిత్రానికి అంగీకరించాడు. టీజర్, ట్రైలర్స్ తో సాహో చిత్రం ఇండియా మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. మరికొన్ని గంటల్లో సాహో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో తెలుసుకుందాం. 

గతంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన టెక్నికల్ వండర్ చిత్రం 2.0 ప్రపంచ వ్యాప్తంగా 6,900 స్క్రీన్స్ లో విడుదలయింది. సూపర్ స్టార్ రజని నటించిన ఈ చిత్రమే ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో హైయెస్ట్ రిలీజ్. ఆ చిత్రాన్ని అధికమిస్తూ సాహో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 10 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. 

తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ, హిందీ భాషల్లో సాహో చిత్రం విడుదలవుతోంది. అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. గురువారం రోజు రాత్రికే సాహో సినిమా టాక్ తెలియనుంది.