ఇండియన్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అంచనాల డోస్ ని తారా స్థాయికి చేర్చుతోంది. ఈ నెల 30న సినిమా తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  

ఇక చిత్ర యూనిట్ సినిమాకు సంబందించిన పోస్టర్స్ తో అలాగే సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా బేబీ వంట్ యూ టెల్ మీ  అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. శంకర్ ఏ హాసన్ లాయ్ గ్యాంగ్ కంపోజ్ చేసిన ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాటలో సరికొత్త విజువల్స్ అలాగే ప్రభాస్ స్టైల్ - శ్రద్దా కపూర్ గ్లామర్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరి బిగ్ స్క్రీన్ పై సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.