Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళికి ప్రతిష్టాత్మక అవార్డ్, సరికొత్త రికార్డ్ సాధించిన టాలీవుడ్ జక్కన్న

రికార్డ్ ల వీరుడిలా తయారయ్యాడు దిగ్గజ దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఈ స్టార్ డైరెక్టర్ ఖాతాలో మరో ప్రతీష్టాత్మక అవార్డ్ వచ్చి చేరింది. 

S S Rajamouli Wins New York Film Critic Circle Awards For RRR Movie
Author
First Published Dec 3, 2022, 11:15 AM IST

టాలీవుడ్ ను హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టి.. ఇండియా గర్వించదగ్గ దర్శకుడిగా పేరు చెతచ్చుకున్నాడు ఎస్ ఎస్  రాజమౌళి.  తనతో పాటు తెలుగు పరిశ్రమకు కూడా ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టిన దిగ్గజ దర్శకుడి ఖాతాలో.. ఎన్నో రికార్డ్ లు ఇప్పటికే వచ్చి చేరాయి.  హీరో క్రేజ్ తో కాకుండా దర్శకుడి విజన ను బట్టి సినిమాలు చూసేది ఒ:క్క రాజమౌళిసినిమాలకే సాధ్యం. బాహుబ‌లి తో  టాలీవుడ్  స్థాయిని మాత్రమే పెంచి.. బాలీవుడ్ ను మించి చేయడగలదు మన తెలుగు పరిశ్రమా అని నిరూపించిన రాజమౌళి.. ఇక ఆర్ఆర్ఆర్ తో ..ఏకంగా ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచాడు. 

ఇండియన్ సినిమాగా హాలీవుడ్‌ సినీ ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్న ఏకైక సినిమాగా ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ సాధించింది. హాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాడు జక్కన్న. ట్రిపుల్ ఆర్ లో కొన్ని సన్నివేశాల గురించి హాలీవుడ్ లో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.రాజమౌళి టేకింగ్‌కు, విజన్‌కు హాలీవుడ్‌ దర్శకులు, టెక్నీషియన్‌లు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాతో రాజమౌళి ఇప్పటికే ఎన్నో అవార్డులను సాధించాడు. కాగా తాజాగా ఈయన మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నాడు.

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌..  రాజమౌళిని బెస్ట్ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ఈ ఏడాది రిలీజ్ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి సెలక్ట్ అయ్యారు. అంతే కాదు ఇప్పటి వరకూ ఇండియాలో ఏ దర్శకుడు ఈ అవార్డ్ ను సాధించలేదు.  ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి  మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి ఒక టాలీవుడ్‌ సినిమా... అందులోను తెలుగు దర్శకుడు ఈ ఘనత సాధించాడు. 

 రాజమౌళి తను ఒక్కడే కాకుండా.. తెలుగు పరిశ్రమను కూడా తనతో పాటు గౌరవం దక్కేలా చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ గా ఉండి కూడా బాలీవుడ్ అంటూ పరుగులు తీయ్యకుండా.. తెలుగు హీరోలు.. తెలుగు సినిమాలతోనే ప్రపంచ స్తాయి గుర్తింపు పొందాడు. రీసెంట్ గా లాస్‌ ఏంజిల్స్ టైమ్స్‌  ఇంగ్లీష్ పేపర్‌ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్‌ ప్రచురించింది. ఆమధ్య ఆస్కార్ కంటే ముందు జరిగే వేడుకలలో హాలీవుడ్ దిగ్గజ దర్శకులతో కలిసి సందడి చేశాడు రాజమౌళి. 

ఇక పాన్ ఇడియా రేంజ్ లో  యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్  కొమురం భీమ్ పాత్రలో న‌టించగా, రామ్‌ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో  కనిపించారు. వీరి జంట గా  బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటీష్ మోడల్ ఓలీవియో హీరోయిన్లుగా న‌టించారు. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్, శ్రీయ కీల‌క‌పాత్ర‌ పోషించాడు. డివివి దాన‌య్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన‌ ఈ చిత్రం మార్చ్ 25న విడుద‌లై  సంచ‌ల‌నం విజ‌యం సాధించింది. ఓవ‌రల్‌గా 1200కోట్లకు పైగా క‌లెక్షన్‌లు సాధించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios