Asianet News TeluguAsianet News Telugu

అలాంటి పాత్రలో నటించాలనుంది.. 'Rx100'హీరోయిన్!

'Rx100' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే క్రేజ్ తగ్గించుకున్న ఈ భామ యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది. 

rx100 heroine payal rajput about her future plans
Author
Hyderabad, First Published Oct 20, 2018, 9:59 AM IST

'Rx100' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే క్రేజ్ తగ్గించుకున్న ఈ భామ యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది.

అయితే మొదటి సినిమాలో మాదిరి నటించమని, ముద్దు సీన్లలో నటించాలని దర్శకనిర్మాతలు తనను సంప్రదిస్తున్నారని ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది పాయల్. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ''ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. 

పంజాబీలో కూడా కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. దాంతో అక్కడికీ, ఇక్కడకీ తిరగాల్సి వస్తోంది. హైదరాబాద్ నాకు బాగా నచ్చింది. ఫ్యూచర్ లో ఇక్కడ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు.

పవర్ ఫుల్ పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ కథలంటే బాగా ఇష్టం. బాలీవుడ్ లో 'హీరోయిన్' సినిమాలో కరీనా కపూర్ చేసిన క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉంది. ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పట్టే పాత్ర అది. అటువంటి బలమైన పాత్రల్లో నటించాలనుంది'' అని చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

ఆఫర్ ఇస్తా.. నాకేంటి అన్నాడు: 'Rx100' హీరోయిన్ ఆవేదన!

స్టార్ హీరోకి నో చెప్పిన 'RX100' హీరోయిన్..?

5 నిమిషాలకు 5 లక్షలు.. 'RX100' హీరోయిన్ డిమాండ్!

ఆ సినిమాలో నన్ను బాగా వాడేశారు.. హీరోయిన్ కామెంట్స్!

 

 

Follow Us:
Download App:
  • android
  • ios