ఆర్ఎక్స్100 సినిమాతో ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ హీరో కార్తికేయ ఆ తరువాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. హిప్పీ - గుణ 369 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు ఎలాగైనా అభిమానులను మెప్పించి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మరొక డిఫరెంట్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు. 

90ML సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన కార్తికేయ ఓ వర్గం ఆడియెన్స్ స్ట్రాంగ్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. చుట్టూ మందు సీసాలతో పడుకున్నట్లు కనిపిస్తూ అధికారిక తాగుబోతు అని ఇంగ్లీష్ లో ఒక డిఫరెట్ ట్యాగ్ ఇచ్చాడు. అశోక్ రెడ్డి గుమ్మ కొండా నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమా ఫస్ట్ లుక్ ఆడియెన్స్ కి నచ్చడంతో టీజర్ ఎలా ఉంటుందా అనే అనే సందేహాలు వెలువడుతున్నాయి. 

ఆర్ఎక్స్ 100 సినిమాకు పనిచేసిన కొంతమంది టెక్నీషియన్స్  ఈ సినిమాకు కూడా పనిచేశారు. ఇప్పటివరకు ఎవరు చూపించని ఒక కొత్త పాయింట్ సినిమాలో చూపించనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. మరి లవర్ బాయ్ గా క్లిక్కయిన కార్తికేయ ఇప్పుడు 90ML కాన్సెప్ట్ తో తాగుబోతుగా ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.