ఓ హిట్ కొట్టినప్పుడు ఆ దర్శకుడు, ఆ హీరో నెక్ట్స్ ఏ సినిమా చేస్తారా అని సినీ అభిమానులు ఎదురుచూస్తూండటం సహజం. దాంతో అలాంటి వార్తలనే వండి వడ్డిస్తూంటారు మీడియా జనం. ఫలానా హీరోతో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడట... ఫలానా నిర్మాత ఈ దర్శకుడుతో సినిమా చేస్తున్నాడంటూ వార్తలు రాస్తూంటారు. ఇవేమీ ఎవరి కెరీర్ ని నష్టపరిచేవి కాకపోవటంతో లైట్ తీసుకుంటూంటారు. కానీ ఆర్ ఎక్స్ 100 చిత్రంలో హిట్ కొట్టిన అజయ్ భూపతి మాత్రం విసుక్కుంటున్నాడు. చిరాకు పడుతున్నాడు. దాన్ని తన సోషల్ మీడియా పేజీలో వ్యక్తం చేసారు.

ఆర్ ఎక్స్ 100 వంటి హిట్  సినిమాను తీసి ఓవర్ నైట్ లో టాలీవుడ్ దృష్టిలో పడ్డాడు దర్శకుడు అజయ్ భూపతి. అడల్ట్ కంటెంట్ ఉందని పేరు తెచ్చుకున్నా సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్స్ రావటంతో అందరి దృష్టీ ఇదే దర్శకుడుపై ఉంది. ఈ దర్శకుడుకి  తరువాత ప్రాజెక్టునే అంత సులువుగా సెట్ కావడంలేదు.  పెద్ద పెద్ద  బ్యానర్లు, రామ్, నితిన్,బెల్లంకొండ శ్రీను  హీరోల పేర్లు వినిపించినా... ఏదీ ఫైనల్ కాలేదు. 

తాజాగా  నాగచైతన్యను-సమంతను కాంబోలో సినిమా ఈ దర్శకుడు చేస్తున్నాడంటూ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించింది.  మరికొందరు అదేమీ కాదు రవితేజతో సినిమా చెయ్యబోతున్నారు అన్నారు. ఈ వార్తలన్ని చూసిన అజయ్ భూపతి ట్విట్టర్ లో తన అసహనం వ్యక్తం చేసారు.  “నా రెండో సినిమా ఎప్పుడు, ఎవరితో, ఎలా తియ్యాలో నాకు తెలుసు ప్లీజ్ స్టార్ రూమర్స్ ,” అంటూ పోస్ట్ చేసారు.