ఈ ఘాటు రొమాన్స్ కు కలెక్షన్స్ ఓవర్ ఫ్లో!

rx 100 movie first weekend collections
Highlights

ఒక చిన్న సినిమా తొలివారంలో ఐదు కోట్ల షేర్ వసూలు చేయడం మామూలు విషయం కాదు. కానీ ఆ ఫీట్ ను అవలీలగా సాధించేసింది 'R X 100' సినిమా. సినిమా విడుదలైన రోజు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ సినిమాలో ఘాటు రొమాన్స్ కు టికెట్లు తెగడం ఖాయమని అంతా అనుకున్నారు

ఒక చిన్న సినిమా తొలివారంలో ఐదు కోట్ల షేర్ వసూలు చేయడం మామూలు విషయం కాదు. కానీ ఆ ఫీట్ ను అవలీలగా సాధించేసింది 'R X 100' సినిమా. సినిమా విడుదలైన రోజు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ సినిమాలో ఘాటు రొమాన్స్ కు టికెట్లు తెగడం ఖాయమని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో ఐదు కోట్ల షేర్ వసూలు కావడం విశేషమనేచెప్పాలి.

ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి రెండున్నర కోట్లు. హీరోకి రెమ్యునరేషన్ కూడా లేదు. తన సొంత బాబాయ్ ఈ సినిమా నిర్మించాడు. ఇప్పుడు కలెక్షన్స్ ఓవర్ ఫ్లో అవ్వడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. ఈ వారంలో విడుదలైన 'చినబాబు' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా ముందు నిలవలేకపోతుంది. ఇక వచ్చే వారంలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి ఈ 'RX100' మరింత దూకుడు చూపించే అవకాశం ఉంది.

దీంతో పాటు శాటిలైట్, డిజిటల్ హక్కులు ఉండనే ఉన్నాయి. వాటికోసం నిర్మాత ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఎలా చూసుకున్న సినిమాకు లాభాల పంటే. ప్రాంతాల వారీగా షేర్ చూసుకుంటే.. ఒక్క నైజాంలోనే 2.42 కోట్ల షేర్ దక్కింది. సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య బోల్డ్ సన్నివేశాలు, ముద్దు సీన్లు ఓ రేంజ్ లో ఉండడంతో యూత్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాలో నటించిన పాయల్ రాజ్ పుత్ కు ఇప్పుడు తెలుగునాట క్రేజ్ బాగానే పెరిగింది.

loader