కార్తికేయ కథానాయకుడిగా చేసిన 'ఆర్ ఎక్స్ 100' యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత హీరోగాఆయన చేసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలోని విలన్ పాత్ర మాత్రం ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

తాజాగా కార్తికేయ హీరోగా మరో సినిమా చేస్తున్నాడు. అదే '90ml'. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేశారు. ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.పూటకో 90 తాగే కేర్‌లేస్‌ కుర్రాడి పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. 

టీజర్‌ ద్వారా సినిమాలో కార్తికేయ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పారు. ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర పేరు దేవదాస్‌. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ ‘ఆథరైజ్డ్‌ డ్రింకర్‌’గా పాపులర్‌ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే కాన్సెప్ట్ తో సినిమాను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుండగా  రవి కిషన్‌, రావూ రమేష్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మాత.