తాజాగా అజయ్‌కి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అజయ్‌ స్వయంగా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వర్మ శిష్యుడైన అజయ్‌, తనకు కరోనా సోకిన విషయాన్ని కూడా కామెడీగానే చెప్పాడు.

కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్‌లోనూ కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే కరోనా ఓ నిర్మాత ప్రాణాలు విడువగా రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్‌ కూడా కరోనా సోకింది. తాజాగా మరో సూపర్‌ హిట్ డైరెక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది.

RX 100 సినిమాతో బ్లాక్‌ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్‌ తన రెండో సినిమాతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌ను కూడా రెడీ చేస్తున్నాడు. అయితే తాజాగా అజయ్‌కి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అజయ్‌ స్వయంగా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వర్మ శిష్యుడైన అజయ్‌, తనకు కరోనా సోకిన విషయాన్ని కూడా కామెడీగానే చెప్పాడు.

Scroll to load tweet…
Scroll to load tweet…

తనకు కరోనా వచ్చిందని, త్వరలోనే కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానంచేస్తానంటూ ట్వీట్ చేశాడు అజయ్‌ భూపతి. తొలి సినిమా ఘనవిజయం సాధించినా అజయ్‌ రెండో సినిమా ఇంకా మొదలు కాలేదు. మహా సముద్రం పేరుతో ఓ మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేసినా ఇంకా అది పట్టాలెక్కలేదు. ఈ గ్యాప్‌ లో ఓ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు అజయ్‌ భూపతి.