రీసెంట్ గా రిలీజై సంచలనం సృష్టించిన 'అవెంజర్స్ ది ఎండ్ గేమ్' చిత్రానికి, ఈ వారం రిలీజ్ అవుతున్న మహేష్ బాబు 'మహర్షి' చిత్రానికి ఓ విషయంలో పోలిక ఉంది.
రీసెంట్ గా రిలీజై సంచలనం సృష్టించిన 'అవెంజర్స్ ది ఎండ్ గేమ్' చిత్రానికి, ఈ వారం రిలీజ్ అవుతున్న మహేష్ బాబు 'మహర్షి' చిత్రానికి ఓ విషయం లో పోలిక ఉంది. కంగారుపడకండి అదేమీ కథ లేక స్క్రీన్ ప్లేనో మరొకటో కాదు లెంగ్త్ విషయంలో. ఎవేంజర్స్ చిత్రం దాదాపు మూడు గంటల ఐదు నిముషాల లెంగ్త్ ఉంది. మహర్షి చిత్రం రెండు గంటల 55 నిముషాల లెంగ్త్ ఉంది.
ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద లెంగ్త్ ఉన్న సినిమాలు రావటం లేదు. దాంతో ఎంతో టైట్ గా స్క్రీన్ ప్లే ఉంటే తప్పించి ఎంగేజ్ చేయటం కష్టం. అవెంజర్స్ ఫస్టాఫ్ లో క్యారక్టర్స్ పరిచయం, వారి ప్లాష్ బ్యాక్ లు గుర్తు చేస్తూ ముందుకు వెళ్లారు. అవెంజర్స్ గత చిత్రాలు చూసిన అభిమానులకు ఇలా పాత కథలు గుర్తు చేసుకోవటం ఆనందం కలిగించింది. మరి మహర్షి లో అలాంటి మ్యాజిక్ ఉంటుందా...ఎక్కడా ల్యాగ్ లేకుండా మూడు గంటలు ముందుకు లాక్కెళ్లటం అంటే మాటలు కాదు. దాదాపు ప్రతీ అరగంటకు ఓ మలుపు రావాల్సిందే. అలా కాకుండా ప్లాట్ గా కధ రన్ చేస్తే కష్టం గా ఉంటుంది.
అయితే దిల్ రాజు, డైరక్టర్ వంశీ పైడిపల్లి కు ప్రేక్షకుల పల్స్ తెలుసు. వారి గత చిత్రాలు ఆ విషయం మనకు చెప్తాయి. కాబట్టి ఖచ్చితంగా సినిమాలో ఆ జాగ్రత్తలు తీసుకునే డిజైన్ చేసి ఉంటారంటున్నారు. ఎమోషనల్ కంటెంట్ తో సినిమాని నింపారని, అదే ప్రేక్షకులను పట్టి ఉంచుతుందని దిల్ రాజు నమ్మకంగా ఉన్నారట.
దానికి తగినట్లు టిక్కెట్టు రేటు పెంచి మరీ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఫస్ట్ వీకెండ్ భారీ ఓపినింగ్స్, కలెక్షన్స్ కు లోటుండదు. అవెంజర్స్ ప్రపంచంలోని అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తే...మహర్షి సైతం తెలుగు సినిమా రికార్డ్ లను ఒంటి చేత్తో బ్రద్దలు చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
