Asianet News TeluguAsianet News Telugu

పేటకి అంత సీన్ లేదా?

శివాజీ - రోబో సినిమాల తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూనే వస్తోంది. అయితే కబాలికి కూడా అదే రేంజ్ లో పెరిగినప్పటికీ సినిమా అనుకున్నంత లాభాలను అందించలేదు. 

RUMOURS ON PETTA TELUGU RIGHTS
Author
Hyderabad, First Published Jan 2, 2019, 4:06 PM IST

శివాజీ - రోబో సినిమాల తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూనే వస్తోంది. అయితే కబాలికి కూడా అదే రేంజ్ లో పెరిగినప్పటికీ సినిమా అనుకున్నంత లాభాలను అందించలేదు. కాలా సినిమా అయితే ఇక్కడ బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిల్చింది. ఆఖరికి 2.0 సినిమా కూడా నిరాశే మిగిల్చింది.  

దీంతో రజినీకాంత్ కి టాలీవుడ్ లో మార్కెట్ తగ్గుతూ వస్తున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఇప్పుడు ఆ ఎఫెక్ట్ పేట సినిమాపై పడిందని తెలుస్తోంది. ఆ సినిమా గట్టిగా 15 కోట్ల ధర కూడా పలకలేకపోయిందని సమాచారం. కానీ రజినీ క్రేజ్ కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని తక్కువధరకే అమ్మినా కూడా 20 కోట్లకు పైగా ధర పలికినట్లు ప్రచారాలను కొనసాగిస్తున్నారు. అసలైతే సినిమా రేట్ 12 కోట్లకు క్లోజ్ అయినట్లు ఇన్ సైడ్ టాక్. 

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సూపర్ స్టార్ పేట సినిమాపై మాత్రం పెద్దగా అంచనాలైతే లేవు. కోలీవుడ్ లో భారీగా రిలీజ్ చేస్తున్నప్పటికీ తెలుగులో థియేటర్స్ దొరకడమే కష్టంగా ఉంది, ఎందుకంటే తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అందరి చూపు ఆ సినిమాలపైనే ఉంది. రీసెంట్ గా రిలీజైన పేట ట్రైలర్ కూడా అంతగా ఆసక్తిగా ఏమి లేదు. దీంతో సినిమా రిజల్ట్ పై అనుమానాలోస్తున్నాయి. ఇక ఫైనల్ గా రజినీకాంత్ అసలు స్టామినా ఏంటో ఈ సినిమాతో తేలిపోతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios