BrahmaMudi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 3వ తేదీ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

ఈరోజు ఎపిసోడ్ లో పంతులుగారు బాబు పెళ్లి కుమార్తె ఇంకా రాలేదు సమయం అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుని కూడా లాభం లేదు అనగా ఇంతలో పక్కనే ఉన్న ఆడవారు అసలు పెళ్లికూతురికి ఇష్టం ఉందో లేదో ఉందో లేక లేచిపోయిందో అని మాట్లాడుతూ ఉండగా స్టాపిడ్ అని గట్టిగా అరుస్తాడు రాజ్. అప్పుడు రాజ్ ఒక ఆడపిల్ల గురించి అందులో పెళ్లికూతురు గురించి ఇలా మాట్లాడడానికి మనసులా వచ్చింది ఇక లాభం లేదు నేనే వెళ్లి పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తాను అని రాజ్ బయలుదేరుతుండగా వద్దు ఆగండి బాబు పెళ్లికూతురు వస్తోంది అనగా అందరూ సంతోష పడుతూ ఉంటారు.

ఇంతలో మీడియా రిపోర్టర్ రాహుల్ నాకు ఎన్ని అబద్ధాలు చెప్పావురా పెళ్లికూతురు కళ్యాణమండపం కి రాదు అన్నావు మరి ఇక్కడ పెళ్ళికూతురు వచ్చింది ఎందుకు నాకు అబద్ధం చెప్పావు అని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు పెళ్లికూతురు కూర్చోబోతుండగా ఇంతలో రాజ్ వాళ్ళ పిన్ని ఆగండి పెళ్లికూతురుకి ముస్తాబే సార్ ఏంటి అని అనడంతో కనకం టెన్షన్ పడుతూ అది మా ఆచారం అని అంటుంది. అప్పుడు పెళ్ళికొడుకు వల్ల నానమ్మ అదేంటి మీకు ఇటువంటి ఆచారం ఉందని మాకు ముందే చెప్పాలి కదా. పెళ్లికూతురు ముసుగుతో ఉంటే పెళ్లికి వచ్చిన వాళ్లకు ఎలా కనిపిస్తుంది. పెళ్లి ఎందుకు పిలుస్తారు ఫలానా అబ్బాయికి ఫలానా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని చెప్పడానికే కదా అని అంటుంది.

అప్పుడు కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇన్ని అబద్ధాలు ఆడిన దానివి అబద్ధం కూడా చెప్పేయ్ కనకం అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు రాజ్ వాళ్ళ పిన్ని అయిన పెళ్లికూతురు వాళ్లకి ఆచారాలు ఉంటే పాటించాల్సిన అవసరం లేదు పెళ్ళికొడుకు వాళ్లకి ఉన్న ఆచారాలు పాటిస్తే చాలు అని అంటుంది. అప్పుడు పంతులు సమయం దాటిపోయింది ఇంకా లేట్ చేస్తే ముహూర్తం దాటిపోతుంది అనడంతో అప్పుడు రాజ్ పిన్ని ఏం కాదులే అది వాళ్ళ ఆచారం అంటున్నారు కదా అని అంటాడు. అప్పుడు కావ్య పెళ్లి పీటల మీద కూర్చొని అక్క డబ్బు వాసన వస్తోంది అహంకారం ప్రేమ పక్కపక్కనే ఉన్నట్టు ఉంది.

నీవల్ల నేను ఈ మనిషిని మోసం చేయాల్సి వస్తోంది ఏంటక్కా నాకు ఈ కర్మ అనుకుంటూ ఉంటుంది. ఈ మోసం బయటపడితే అందరి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది తొందరగా రా అక్క అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్, కావ్య ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు. మరొకవైపు ఉన్న వాళ్ళ ఫ్రెండ్ కలిసి స్వప్న కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు రాజ్ స్వప్నని మాట్లాడమని అంటూ ఉంటాడు. అప్పుడు కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు అపర్ణ స్వప్న కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత కన్యాదానం జరుగుతూ ఉండగా అప్పుడు కావ్య మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కనకం కాసేపు మౌనంగా ఉండు కావ్య అని సర్ది చెబుతూ ఉంటుంది. మరోవైపు అపర్ణ స్వప్న కోసం వెతుకుతూ ఉంటుంది.

 ఆ తర్వాత మూర్తి కనకం ఇవి స్వప్న చేతులు కాదు కావ్య చేతులు కదా అనడంతో కనకం టెన్షన్ పడుతూ మాట్లాడకండి సైలెంట్ గా ఉండండి అని అంటుంది. అది చూసి రుద్రాణి సంతోషపడుతూ ఉంటుంది. మరొకవైపు రాహుల్,స్వప్న కారులో వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మూర్తి ఏంటే ఇది అక్కడ ఎవరే కూర్చోన్నది అనడంతో స్వప్న అని అనగా నా కూతురు చేతిలో నేను గుర్తుపట్టలేనా స్వప్న ఎక్కడికి వెళ్లింది అనడంతో అప్పుడు కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు రాహుల్ గురించి స్వప్న, స్వప్న గురించి రాహుల్ మనసులో చాలానే ఊహించుకుంటూ సంతోషపడుతూ ఉంటారు.

 తర్వాత స్వప్న రాహుల్ కారు ఆపు అనడంతో ఎందుకు స్వప్న కారు ఆపమని చెప్పావు అనగా ఇక్కడ గుడి ఉంది గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకుందాం రా రాహుల్ అనడంతో ఏంటి స్వప్న నా మీద నమ్మకం లేదా అనగా నమ్మకం ఉంది అందుకే పెళ్లి చేసుకుందాం పదా అని అంటుంది. అది కాదు రాహుల్ మనం చాలా తప్పు చేసాం దుగ్గిరాల కాబోయే కోడలు లేచిపోయింది అంటే ఇప్పటికే వెతకడం మొదలు పెట్టి ఉంటారు పొరపాటున మనం దొరికితే వెళ్లి మళ్లీ పెళ్లి చేస్తారు రాహుల్ అందుకే అని అంటుంది స్వప్న. మనం పెళ్లి చేసుకోవాలి రాహుల్ అనడంతో నేను నిన్ను పెళ్లి చేసుకొని స్వప్న అని అంటాడు.

అప్పుడు రాజ్ ఎదురుగా స్వప్న ఉంది అనుకొని నేను నిన్ను పెళ్లి కూతురుగా ఎప్పుడెప్పుడు చూస్తానా ఎదురుచూస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ తెర ఒకటి అడ్డుగా పెట్టారు. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని మాట్లాడటంతో కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కనకం జరిగింది మొత్తం వివరించడంతో మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంత మోసం చేస్తావా ఈ విషయం నేను చెప్పేస్తాను అనడంతో ఆగండి మీరు అక్కడికి వెళ్లారంటే ఆ క్షణమే నా శవాన్ని చూస్తారు అని మూర్తిని బ్లాక్ మెయిల్ చేస్తుంది కనకం.

అదేంటి రాహుల్ అనడంతో నేను పెళ్లిని ఎప్పుడు సింపుల్ గా గుళ్లో చేసుకోవాలని అనుకోలేదు.పెళ్లి విషయంలో నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అవి ఏంటో నీకు కూడా తెలుసు అని అంటాడు. అప్పుడు రాహుల్ మాటలను గుడ్డిగా నమ్మిన స్వప్న రాహుల్ తో పాటు అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడంతో కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది.