మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ మహర్షి సినిమా యావరేజ్ రివ్యూలతో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా నైజం ఏరియాలో మహేష్ ఊహించని కలెక్షన్స్ ను అందుకొని నాన్ బాహుబలి రికార్డ్స్ తో దూసుకుపోతున్నాడు. 

హైదరాబద్ సినిమాల అడ్డా..  RTC X రోడ్ లో మహర్షి అజ్ఞాతవాసి కంటే 1,809 రూపాయలను ఎక్కువ కలెక్ట్ చేసింది. ఈ ఏరియాలో బాహుబలి -  రూ.36,09,236లు వసూలు చేయగా.. మహర్షి రూ.28,98,581ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. ఇక ఆ తరువాత  అజ్ఞాతవాసి రూ.28,96,772 కలెక్షన్స్ తో మహేష్ కంటే వెనుకబడిపోయింది. 

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. మురారి నుంచి మహర్షి వరకు అన్ని సినిమాలు ఈ ఏరియాల్లో మినిమమ్ వసూళ్లను రాబట్టాయి. పవన్ సినిమాలు కూడా ఈ మాస్ ఏరియాల్లో ఎప్పటికప్పుడు హౌస్ ఫుల్స్ తో కలెక్షన్స్ అందుకుంటాయి. అయితే గత ఏడాది నుంచి ఈ ఏరియాలో అజ్ఞాతవాసి ఫస్ట్ డే రికార్డ్ ను బ్రేక్ చేయడం ఎవరివల్ల కాలేదు. ఇప్పుడు మహర్షి ఆ పవన్ సినిమాకంటే 1,809 రూపాయలను ఎక్కువ వసూలు చేయడం విశేషం.