రాత్ అకేలి హై సినిమాతో ఇటీవల హనీ ట్రెహన్ దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆర్‌ఎస్‌వీపీ బ్యానర్‌లో గతంలో పరిచయం అయిన వసన్‌ బాలన్, ఆదిత్య ధర్‌లు ప్రోడక్షన్‌ హౌజ్‌కు సంబంధించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2019 లో ఆర్‌ఎస్‌విపి సంస్థ ఒక పాత్‌ బ్రేకింగ్ ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చింది. `ఉరి: సర్జికల్ స్ట్రైక్` సినిమాతో  ఆదిత్య ధార్‌ ను ప్రపంచానికి పరిచయం చేసింది. నిర్మాత రోని తన విజన్‌తో క్రియేటివ్‌ ప్రాజెక్ట్స్‌ను సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు.

ఆదిత్య ధార్ మాట్లాడుతూ.., `అతను గొప్ప దర్శకులను పరిచయం చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటాడు. దిబాకర్ బ్యానర్జీ, విక్రమాదిత్య మోట్వానే, నీరజ్ పాండే, వాసన్ బాలా, రాజ్‌కుమార్ గుప్తా ఇలా చాలా మంది ఆయన స్కూల్‌ నుంచే వచ్చారు. అప్పటి వరకు కమర్షియల్ హీరోగా చేయని విక్కీ కౌశల్‌తో, పెద్దగా లాభాలు తీసుకురాన్ని వార్‌ బేస్డ్ మూవీ చేయడానికి ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాడు రోనీ`

రోనికి ఏ కథ వర్క్‌ అవుట్ అవుతుందో, ఏ కథ వర్క్‌ అవుట్‌ కాదో బాగా తెలుసు, అందుకే ఆయన కథల ఎపింక, దర్శకులు, ఆర్టిస్ట్‌ల సెలక్షన్‌ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దర్శకులకు ఆయన ఎంతో స్వేచ్చ ఇస్తాడు. ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్పేతత్వం, హాస్య చతురత ఆయనకు అదనుపు బలాలు అని ఆయనతో కలిసి పనిచేసిన దర్శకులు చెబుతుంటారు. ఆయన దేశంలోనే పెద్ద నిర్మాతల్లో ఒకడైనా తన యూనిట్ సభ్యులకు అర్ధరాత్రిలో కూడా అందుబాటులో ఉంటాడు.

ఆర్‌ఎస్‌విపితో అరంగేట్రం చేసిన దర్శకులు

  • ఆదిత్య ధారా URI: సర్జికల్ స్ట్రైక్
  • వాసన్ బాలా— మార్డ్ కో డార్డ్ నహి హోటా
  • వినోద్ కప్రి - పిహు
  • ఆకర్ష్ ఖురానా కార్వాన్
  • స్నేహ తౌరాని— భాంగ్రా పా లే
  • ఆనంద్ తివారి— లవ్ పర్ స్క్వేర్ అడుగు
  • హనీ ట్రెహాన్ రాత్ అకేలి హై