సినిమాలో ఇంటర్వెల్ ట్విస్టు అనే పాయింట్ తప్ప ఇంకేమీ లేదు. కేవలం పాయింటు నచ్చి సినిమా ఓకే చేసాడంటే డైరక్టర్  మీద  నమ్మకముండుండాలి. మరి అదే దర్శకుడితో తాను చేసిన "వీరా" డిజాస్టర్. ఆ డైరక్టర్ ఈ మధ్యన తీసిన స్ట్రైట్ కమెర్షియల్ ఎంటర్టైనర్ కూడా ఏదీ లేదు. మరి ఎందుకు ఓకే చేసిన్నట్టు?  అని టాపిక్ నడిచింది.


క్రితం సంవత్సరం "క్రాక్" తో హిట్ కొట్టిన రవితేజ ఈ సారి "ఖిలాడి"తో ముందుకొచ్చాడు. రిలీజ్ కి ముందు జరిగిన వేడుకలో "శ్రీకాంత్ విస్సా కథ వినగానే ఓకే చేసాను" అంటూ ఆ కథకుడిని స్టేజీ మీదకు పిలిచి హత్తుకుని అభినందించాడు రవితేజ. అలాంటి కథకుడిని పరిచయం చేసినందుకు దర్శకుడు రమేష్ వర్మకి ధన్యవాదాలు కూడా చెప్పాడు. అయతే సినిమాలో అంత విషయం లేదని తేలిపోయింది. దాంతో అసలేం కథ విని రవితేజ ఈ సినిమాని ఓకే చేసాడో అర్థం కాదంటూ మీడియాలో రవితేజ పై వరస సెటైర్స్ పడుతున్నాయి.

దానికి తగినట్లు సినిమాలో ఇంటర్వెల్ ట్విస్టు అనే పాయింట్ తప్ప ఇంకేమీ లేదు. కేవలం పాయింటు నచ్చి సినిమా ఓకే చేసాడంటే డైరక్టర్ మీద నమ్మకముండుండాలి. మరి అదే దర్శకుడితో తాను చేసిన "వీరా" డిజాస్టర్. ఆ డైరక్టర్ ఈ మధ్యన తీసిన స్ట్రైట్ కమెర్షియల్ ఎంటర్టైనర్ కూడా ఏదీ లేదు. మరి ఎందుకు ఓకే చేసిన్నట్టు? అని టాపిక్ నడిచింది. దానికి తోడు సినిమా రిలీజ్ అయ్యాక రమేష్ వర్మ బార్య...ఇనిస్ట్రాలో రవితేజ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెట్టింది. ఈ నేపధ్యంలో రమేష్ వర్మ ఏమన్నారు.

రమేష్ వర్మ మాట్లాడుతూ... “ఖిలాడీ పబ్లిక్ కోసం తీసింది. వారికి నచ్చింది. కామన్ ఆడియన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. నిర్మాత ఆనందంగా ఉన్నారు. అంతేకాదు నిర్మాత నాకు వంద కోట్ల ప్రాజెక్ట్ ఆఫర్ చేసారు ” అని చెప్పుకొచ్చారు. నిజమే అయితే సంతోషమే. ఈ నేపధ్యంలో ఈ కౌంటర్ సినిమా బాగోలేదన్న రవితేజ గురించే అని అంటున్నారు. ఇంతకీ ఆ వంద కోట్ల ప్రాజెక్టు ఏమిటి?

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాట్ససన్’ మూవీ తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘రాక్షసుడు’ టైటిల్ తో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. 2019 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు రమేష్ వర్మ ఒరిజినల్ ను ఏమాత్రం పాడు చేయకుండా చాలా చక్కగా తెలుగులోకి రీమేక్ చేసాడు. నిర్మాతకు చాలా వరకు డబ్బులు మిగిలేలా చేసాడు. ‘ఎ స్టూడియో’ బ్యానర్ పై హవీష్, సత్యనారాయణ కోనేరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘రాక్షసుడు2’ ని రూపొందించడానికి కూడా రెడీ అయినట్టు ఆ మధ్యన అధికారికంగా ప్రకటించారు. రమేష్ వర్మనే ఈ సీక్వెల్ కు కూడా దర్శకుడు. అయితే ‘రాక్షసుడు2’ ఒరిజినల్ లో రూపొందలేదు. అయితే ఇక్కడ తెరకెక్కించడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో.. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టుని రూపొందించబోతున్నట్టు కూడా ప్రకటించారు. తెలుగులో రూ.15 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీకి రూ.100 కోట్లు పెట్టి సీక్వెల్ తీయడం ఏంటి అని అంతా షాక్ అయ్యారు. ఇప్పుడా ప్రాజెక్టు గురించేనా రమేష్ వర్మ చెప్తోంది?