బలమైన భావోద్వేగాలుంటే ఎక్కువమంది ప్రజలు మన సినిమాను ఇష్టపడతారని నా కెరీర్ ప్రయాణంలో నేర్చుకున్నా. అదే నేనిపుడు చేస్తున్నానన్నాడు రాజమౌళి. బాహుబలి సినిమాను దేశమంతా ఎలా ఇష్టపడిందని చూసినపుడు, మానవ భావోద్వేగాల ఆధారంగా రాసుకున్న కథలను సినిమాలుగా తీస్తే..ఫలితం బాహుబలిలా ఉంటుందని తెలుసుకున్నట్టు చెప్పాడు.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెపుడా ఎంతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా విడుదల అవుతోంది. ఈ క్రమంలో రాజమౌళి ఆయన టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ కోసం హైదరాబాద్, బెంగళూరు, బరోడా, ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్‌కతా, వారణాసి, దుబాయ్ ను చుట్టి వచ్చేస్తున్నారు. ఎడతెగని ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంకు ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనేది హాట్ టాపిక్ గా మారింది.
ట్రేడ్ నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 453 కోట్లకు పైగా జరిగింది. దాంతో సినిమా విడుదలైన తర్వాత సంచలనాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటి నుంచే లెక్కేసుకుంటున్నారు అభిమానులు. ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుంది...సినిమాకు ఏం రేంజిలో హిట్ టాక్ వస్తుంది. బెనిఫిట్ షోలు ద్వారా ఎంత రాబడి ఉందనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతానికి ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ లెక్కలు చూద్దాం.
నైజాం - 70.00 కోట్లు
(కేవలం తెలంగాణా )
సీడెడ్ - 37.00కోట్లు
నెల్లూరు - 08.00కోట్లు
గుంటూరు - 15.00కోట్లు
కృష్ణా - 13.00కోట్లు
వెస్ట్ గోదావరి - 12.00కోట్లు
ఈస్ట్ గోదావరి- 14.00కోట్లు
ఉత్తరాంధ్ర - 22.00కోట్లు
( వైజాగ్ ఏరియా )
రెండు తెలుగు రాష్ట్రాలు - 191.00కోట్లు
కన్నడ - 41.00కోట్లు
తమిళం - 35.00కోట్లు
మళయాళం - 09.00కోట్లు
హిందీ - 92.00కోట్లు
భారత్ లో మిగిలిన ప్రాంతాలు - 08.00కోట్లు
ఓవర్ సీస్ – 75.00కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ (PreRelaese Business) - 451.00కోట్లు
బ్రేక్ ఈవెన్ రావాలంటే - 453.00కోట్లు
రాజమౌళి మాట్లాడుతూ... బలమైన భావోద్వేగాలుంటే ఎక్కువమంది ప్రజలు మన సినిమాను ఇష్టపడతారని నా కెరీర్ ప్రయాణంలో నేర్చుకున్నా. అదే నేనిపుడు చేస్తున్నానన్నాడు రాజమౌళి. బాహుబలి సినిమాను దేశమంతా ఎలా ఇష్టపడిందని చూసినపుడు, మానవ భావోద్వేగాల ఆధారంగా రాసుకున్న కథలను సినిమాలుగా తీస్తే..ఫలితం బాహుబలిలా ఉంటుందని తెలుసుకున్నట్టు చెప్పాడు. కొన్ని సినిమాలు (ఇతర పాన్ ఇండియా సినిమాలు) బాగా ఆడుతున్నాయి. వారి సినిమాలు సక్సెస్‌ఫుల్ అవుతున్నందుకు జక్కన్న చాలా సంతోషంగా ఉందన్నారు.
