అవార్డ్ ల పండ పండిస్తుంది ఆర్ఆర్ఆర్ మూవీ. తన ఖాతాలో మరో ప్రఖ్యాత అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఈసందర్భంగా రాజమౌళి స్పీచ్ కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ జక్కన్న ఏమాన్నాడంటే..?
హాలీవుడ్ లో అవార్డ్ ల పంట పండిస్తుంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఎక్కడా తగ్గడంలేదు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ అద్భుత దృశ్యకావ్యం హాలీవుడ్ మేకర్స్ ను సైతం ఆకర్షిస్తోంది. అంతటా ఆర్‌ఆర్‌ఆర్ అదరగొడుతోంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో మరో అరుదైన అవార్డ్ వచ్చి చేరింది. ఉత్తమ విదేశీ భాష చిత్రంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును సొంతం చేసుకుంది ట్రిపుల్ ఆర్ మూవీ. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ అవార్డుల వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నరు రామజౌళి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
అవార్డు అందుకున్నాక స్టేజ్ పై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు జక్కన్న. ఈ అవార్డ్ అందుకునేంతలా నేను ఎదిగాను అంటే దానికి తన జీవితంలో ఉన్న కొంత మంది మహిళలే కారణం అని అన్నారు రాజమౌళి. నా జీవితంలోని మహిళలందరికీ ఈ అవార్డ్ ఘనత దక్కుతుంది అన్నారు. అంతే కాదు... నా తల్లి రాజనందిని నేను స్కూలింగ్ లో ఉన్నట్టు ఎప్పుడూ కామిక్స్, కథల పుస్తకాలు చదవమని ఎంకరేజ్ చేసేది. దాంతోపాటు నాలోని క్రియేటివిటీని ప్రోత్సహించింది మా అమ్మ అని గర్వంగా చెప్పారు జక్కన్క. అంతే కాదు అమ్మ తరువాత నాకు అమ్మలాంటిది, మా వదిన శ్రీవల్లి.. ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చింది అన్నారు.
ఇక తాను పెళ్ళి చేసుకున్న భార్య రమా.. గురించి కూడా గొప్పగా చెప్పారు రాజమౌళి. ఆమె నా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రమే కాదు. అంతకు మించి నా జీవితానికి రూపకర్త. ఆవిడలేకపోతే నేను ఈ స్థాయికి చేరే వాడిని కాదేమో. ఇక నా కూతుళ్లు. వారు ఏమీ చెయ్యరు. వాళ్ల స్మైల్ చాలు నా జీవితంతో వెలుగులు నిండుతాయి అన్నారు. ఇక స్పీచ్ అయిపోగానే మేరా భారత్ మహాన్. జై హింద్.. అంటూ స్పీచ్‌ను ముగించారు. ఈ వీడియోను ఆర్‌ఆర్‌ఆర్ టీం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఈరోజు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు.. టైటానిక్, అవతార్ లాంటి అద్భుతాల సృష్టి కర్త జేమ్స్ కామెరూన్ ను కలుసుకున్నారు రాజమౌళి. అంతే కాదు దాదాపు 10 నిమిషాల పాటు వారి మధ్య సినిమాల గురించి డిస్కర్షన్ జరిగింది. అంతే కాదు..తాను ట్రిపుల్ ఆర్ సినిమా చూశానని.. ఆ సినిమాన చాలా బాగుందని. ఎంతో ఇష్టపడ్డాను అంటూ జేమ్స్ కామెరూన్ రాజమౌళితో అన్నారు. పక్కనే ఉన్న తన భార్యను కూడా ఈ సినిమా చూడాలంటూ సిఫార్స్ చేశారు. తనతో పాటు మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి చూశానన్నారు జేమ్స్. దాంతో రాజమౌళి ఆనందానికి అవధులులేకుండా పోయాయి.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. భారీ కలెక్షన్లతో పాటు.. హాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకర్షించిన ఈ సినిమా.. తన విజయ ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. హాలీవుడ్ లో మరింత పాపులారిటీ సాధిస్తోంది మూవీ.. వరుస గౌరవాలు సాధిస్తుండటంతో.. వాటిని అందుకోవడం కోసం రాజమౌళి కొంత కాలంగా ఫారెన్ టూర్లలోనే ఉంటూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇంకా ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ.. సందడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ గెలుచుకుంది. ఈ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ కు దేశమంతా అభినందనలు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి..ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు కూడా టీమ్ ను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. చెప్తున్నారు. ఇక ఇప్పటికే RRR సినిమా, నాటు నాటు సాంగ్ ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్ లో నిలిచాయి. ఎలాగైనా ఆస్కార్ కొట్టాలని రాజమౌళి అమెరికాలోనే ఉండి RRR ని మరింత ప్రమోట్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడు.
