Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్: RRR ప్రభంజనం, నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. గంతులేసిన రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్

ఆర్ఆర్ఆర్ చిత్రం విశ్వవ్యాప్తంగా ఒక ప్రభంజనంలా మారుతోంది. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ పాశ్చాత్త దేశాల్లో అభిమానులని ఎలా ఉర్రూతలూగిస్తోందో అందరికీ తెలిసిందే.

RRR wins golden globe award for naatu naatu song
Author
First Published Jan 11, 2023, 7:56 AM IST

ఆర్ఆర్ఆర్ చిత్రం విశ్వవ్యాప్తంగా ఒక ప్రభంజనంలా మారుతోంది. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ పాశ్చాత్త దేశాల్లో అభిమానులని ఎలా ఉర్రూతలూగిస్తోందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై అనేక అవార్డులు ఆర్ఆర్ఆర్ సొంతం అవుతున్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. 

ఇండియన్ సినిమా ఖ్యాతిని మరింత పెంచేలా తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకి ఈ అవార్డు దక్కింది. 'అవార్డు గోస్ టూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు' అని ప్రకటించగానే రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ లో సంతోషం ఉప్పొంగింది. 

ఒక్కసారిగా పైకి లేచి సంతోషంతో చప్పట్ల మోత మోగించారు. ఇక సంగీత దర్శకుడు కీరవాణికి ఆనందంలో ఏంచేయాలో అర్థం కాలేదు. తడబడుతూ కనిపించారు. ఈ దృశ్యాల్ని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

 

వేదికపైకి వెళ్లి కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. రాజమౌళి మరే ఇండియన్ డైరెక్టర్ కి సాధ్యం కాని విధంగా ఇండియన్ సినిమాని అంతర్జాతీయ వేదికలపై నిలబెడుతున్నారు. 

కీరవాణి విషయానికి వస్తే.. ఆయన తన సోదరుడు రాజమౌళి చిత్రం అంటే చెలరేగిపోతారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా అద్భుతమైన సంగీతం, బిజియం అందించారు. నాటు నాటు సాంగ్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ గా నిలిచిందో చెప్పనవసరం లేదు. కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ ఒకెత్తయితే.. రాంచరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ మారో ఎత్తు. వంక పెట్టడానికి చిన్న అవకాశం కూడా లేకుండా వీరిద్దరూ పర్ఫెక్ట్ సింగ్ లో డ్యాన్స్ అదరగొట్టేశారు. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం ఒక ప్రభంజనం అనే చెప్పాలి. ఇక ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ టార్గెట్ ఆస్కార్ అవార్డే. 

Follow Us:
Download App:
  • android
  • ios