కరోనా విపత్తుతో సినీ పరిశ్రమ అల్లల్లాడుతోంది. ఓ ప్రక్కన థియోటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, షూటింగ్  లు ఎలా ప్రారంభించాలో తెలియని పరిస్దితి నెలకొంది. మరో ప్రక్కన ఇప్పటికే మొదలైన పెద్ద సినిమాలకు మరో పెద్ద తలనొప్పి మొదలైంది. డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ లు వెనక్కి అడగటం మొదలెట్టారు. ఆ సెగ మొదటగా ఆర్ ఆర్ ఆర్ కు తగిలింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ...ఈ సినిమా రైట్స్ నిమిత్తం  మూడు కోట్లు అడ్వాన్స్ చెల్లించింది. ఓవర్ సీస్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రం రైట్స్ అరవై కోట్లు పైగా పెట్టి తీసుకున్నారు. 

వారు దాన్ని ఏరియావైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, అందులో భాగంగా యుఎస్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకు అడ్వాన్స్ తీసుకుని ఎగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ ఎగ్రిమెంట్ లో జూలై 30,2020 న లేదా జనవరి 8,2021 కాని రిలీజ్ అవుతుందని ఉంది. అయితే ఈ రెండు తేదీల్లో రిలీజ్ అయ్యే పరిస్దితి కనపడటం లేదని భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అంతా బాగున్న రోజుల్లో అడిగి మరీ అడ్వాన్స్ లు ఇచ్చిన వారు..ఇప్పుడు రిలీజ్ లు లేటు అయ్యేసరికి అడ్వాన్స్ లు వెనక్కి అడుగుతున్నట్లు సమాచారం. 

ప్రధానంగా ముందుగా అనుకున్న రేట్లు ప్రకారం అయితే ఇప్పుడున్న కరోనా పరిస్దితుల్లో థియోటర్స్ ఫిల్ కావటం, కలెక్షన్స్ రావటం,తమకు రికవరీ  జరగదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినపడుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు మెయిన్ డిస్ట్రిబ్యూటర్ పై ఆ ఒత్తిడి పడనుంది. వాళ్లు ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నిర్మాతతో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం. వీటినుంచి బయిటపడేందుకే రాజమౌళి..షూటింగ్ త్వరగా మొదలెట్టాలని భావించి,టెస్ట్ షూట్ కు రెడీ అవుతున్నారు.