Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సంక్రాంతికే: అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడే స్టార్టైంది

థియేటర్లు పూర్తిస్థాయిలో అక్టోబరు 22 తర్వాత తెరుచుకుంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినే కొన్ని గంటల్లోనే వరసపెట్టి భారీ చిత్రాలు విడుదల తేదీ ఖరారు చేసుకోవటం మొదలెట్టాయి. ఆ క్రమంలోనే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టీమ్ కూడా వెంటనే ఓ నిర్ణయానికి వచ్చిందని, అతి త్వరలోనే అఫీషియల్ ప్రకటన వస్తుందని అంటన్నారు. 
 

RRR to hit the screens for Sankranthi 2022
Author
Hyderabad, First Published Sep 29, 2021, 7:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ . పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుద‌ల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజమౌళి  చేస్తున్న చిత్రం కావ‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై వాయిదాల మీద వాయిదాలు ప‌డుతుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసుకున్నారట. అందుకు కారణం మహారాష్ట్రలో థియోటర్స్ ఓపెన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే అని తెలుస్తోంది.

కరోనా తగ్గుముఖం పట్టినా హిందీ పరిశ్రమలో సందడి లేకపోవటంతో చాలా పెద్ద సినిమాలు అయోమయంలో పడిపోయాయి. ఎందుకంటే ఇప్పటిదాకా బాలీవుడ్‌కు కీలకమైన మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోలేదు. అప్పటికీ ఇలాంటి సిట్యువేషన్ లో  ధైర్యం చేసి ముందుకొచ్చిన ‘బెల్‌బాటమ్‌’ లాంటి చిత్రాలకు ఆశించిన వసూళ్లు దక్కలేదు. దీంతో థియేటర్లను వందశాతం తెరవాలని చిత్ర పరిశ్రమ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందరో ప్రముఖులు విన్నవించుకున్నారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్న చిత్రసీమకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. వచ్చే నెల 22 తర్వాత సినిమా హాళ్లు తెరచుకోనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 

‘‘ఆరోగ్య నియమాలు, కరోనా  నిబంధనలు పాటిస్తూ అక్టోబరు 22 తర్వాత థియేటర్లు తెరుస్తాం. పూర్తిస్థాయి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. థియేటర్లు తెరచినా వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తారా? లేదంటే 50శాతంతోనే థియేటర్లు తెరవాలంటారో అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. థియేటర్లు పూర్తిస్థాయిలో అక్టోబరు 22 తర్వాత తెరుచుకుంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినే కొన్ని గంటల్లోనే వరసపెట్టి భారీ చిత్రాలు విడుదల తేదీ ఖరారు చేసుకోవటం మొదలెట్టాయి. ఆ క్రమంలోనే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టీమ్ కూడా వెంటనే ఓ నిర్ణయానికి వచ్చిందని, అతి త్వరలోనే అఫీషియల్ ప్రకటన వస్తుందని అంటన్నారు. 

ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమా వాయిదా ప‌డుతుంద‌ని, వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌లవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో సినీ వ‌ర్గాల తాజా స‌మాచారం మేర‌కు, ట్రిపుల్ ఆర్ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నారు అని తెలుస్తోంది. జ‌న‌వ‌రి 12న ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని, దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తే సినీ ఇండ‌స్ట్రీలో మిగతా స్టార్ హీరోలకు  కొత్త సమస్య ఎదురయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ను ద‌స‌రాకు విడుదల చేస్తామ‌ని చెప్పిన త‌ర్వాతే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న భీమ్లా నాయ‌క్ సినిమాను జ‌న‌వ‌రి 12న‌.. మ‌హేశ్ త‌న స‌ర్కారు వారిపాట చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. షూటింగ్స్ ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు మ‌రోసారి ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేయ‌డ‌మే కాకుండా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకుంటే., ప‌వ‌న్‌, మహేష్  త‌మ సినిమా రిలీజ్ డేట్స్ కన్ఫూజన్ లో  ఏర్ప‌డిన‌ట్లే.  ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మారితే టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొత్త గా లెక్కలు, రిలీజ్ డేట్స్ మారతాయి.
 
 1920వ దశకం నేపథ్యంలో సాగే కథ. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. అలియాభట్‌, శ్రియ, అజయ్‌ దేవగణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తుండగా, కొమరం భీం పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టీజర్స్ విడుదలై అభిమానులను అలరించాయి. చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తోంది.  ఐరిష్ నటి ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్‌ సరసన నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios