Asianet News TeluguAsianet News Telugu

ఈ ఎపిసోడ్ కోసమే ఒకటికి పదిసార్లు చూస్తారట

బాహుబలి త‌రువాత జ‌క్క‌న్న చేస్తున్న సంచ‌ల‌న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తుండ‌టంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

RRR to have a high voltage train action block
Author
Hyderabad, First Published Sep 3, 2020, 7:03 AM IST

దాదాపు 80 శాతం షూటింగ్ పూర్త‌యిన  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు క్రేజీ అప్ డేట్స్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.  తాజాగా వచ్చిన అప్‌డేట్ మాత్రం అభిమానులను పీక్స్ కు తీసుకెళ్తోంది. అదేమిటంటే...ఈ చిత్రంలో అద్బుతంగా సాగే ట్రైన్ ఎపిసోడ్ ఒక‌టి వుంద‌ని, దీన్ని రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌పై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ఒకటికి పదిసార్లు సినిమా చూస్తారని, అంత అద్బుతంగా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఫైట్ మాస్టర్స్ ఆద్వర్యంలో రిహార్సల్స్ సైతం చేయబోతున్నారట. 

ఈ ఎపిసోడ్ ని 30 రోజుల్లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశార‌ని, ఇందు కోసం ఓ ప్రైవేట్ స్టూడియోలో ట్రైన్ సెట్‌ని ప్ర‌త్యేకంగా నిర్మిస్తున్నార‌ని తెలిసింది. ఈ ఎపిసోడ్ సినిమాలో 3 నిమిషాల పాటు రోమాంచితంగా సాగ‌నుంద‌ని, ఇదే `ఆర్ ఆర్ ఆర్‌`కు మేజ‌ర్ హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ని తెలిసింది.

ఇక చిత్రం షూటింగ్ వివరాల్లోకి వెళితే...దర్శక ధీరుడు యస్‌.యస్‌ రాజమౌళి కరోనాను జయించారు. తిరిగి యధావిధిగా పనుల్లో పడ్డారు. తమ తాజా ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయమై ఆయన ఈ సారి సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్దితుల్లోనూ త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన అనువైన, ఏ విధమైన ఇబ్బందులు రానటువంటి ప్లానింగ్ చేయబోతున్నట్లు సమచారం. అందుకోసం ఓ కొత్త ఐడియా ఆలోచించినట్లు సమాచారం. 

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ..తాజా చిత్రం బెల్ బాటమ్ షూటింగ్ ...కరోనా ప్రభావం లేని యూరప్ దేశాల్లో నిశ్చింతగా మొదలైంది. వారు ధైర్యంగా అక్కడ షూటింగ్ చేసుకుంటున్నారు. అదే విధంగా తాము కూడా అటువంటి దేశం ఎంచుకుని అక్కడ క్రూని సమకూర్చుకుని షూటింగ్ లో చాలా భాగం ఫినిష్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాధ్యా సాధ్యాలను రాజమౌళి టీమ్ పరిశీలిస్తోందని వినికిడి. కరోనా కేసులు లేని దేశంలో లొకేషన్ ఎంపిక చేసి, ఫర్మిషన్స్ తీసుకోవటం పై ప్రస్తుతం నిర్మాత దానయ్య టీమ్ ముందుకు వెళ్తోంది.

ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మొత్తంలో పలు గెటప్స్‌లో కనిపిస్తారట ఈ ఇద్దరు హీరోలు. బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్‌ వేసి వాళ్లను తెలివిగా ఢీ కొంటారని చెప్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్, బందిపోటు గెటప్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారట.

మరికొన్ని గెటప్స్‌లోనూ ఎన్టీఆర్, చరణ్‌లు కనిపిస్తారని తెలిసింది. ఈ స్పెషల్‌ గెటప్స్‌ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. త్వరలోనే తిరిగి సెట్స్‌ మీదకు వెళ్లనుంది చిత్ర టీమ్. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios