Asianet News TeluguAsianet News Telugu

చివరి షెడ్యూల్ కొరకు ఉక్రెయిన్ కి ఆర్ ఆర్ ఆర్ టీమ్

చివరిదైన ఉక్రెయిన్ షెడ్యూల్ నందు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొన్ని భాషలకు డబ్బింగ్ కూడా చెప్పారట. 

rrr team heading ukraine for its last schedule conforms makers
Author
Hyderabad, First Published Aug 3, 2021, 10:12 AM IST

అనుకున్న తేదీకి రావడం కోసం వడివడిగా అడుగులు వేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా లాస్ట్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళుతున్నారు. ఈ మేరకు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. చివరిదైన ఉక్రెయిన్ షెడ్యూల్ నందు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొన్ని భాషలకు డబ్బింగ్ కూడా చెప్పారట. 


మరోవైపు దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ జోరు పెంచారు. ఫ్రెండ్షిప్ డే కానుకగా ఆగష్టు 1న విడుదలైన దోస్తీ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. వివిధ పరిశ్రమలకు చెందిన స్టార్ సింగర్స్ పాడిన దోస్తీ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంటుంది. కీరవాణి స్వరపరిచిన దోస్తీ సాంగ్ ని హేమ చంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాసు, యాజిన్ నిజార్ పాడారు. 


ఆర్ ఆర్ ఆర్ నుండి వచ్చిన ప్రతి ప్రమోషనల్ వీడియో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేర్చాయి. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి మరో భారీ హిట్ కొట్ట బోతుననట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల తేది ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ గా విడుదల కానుంది. బాహుబలికి మించి విదేశీ బాషలలో కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల కావడం విశేషం. 


ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితగాథలకు ఫిక్షన్ జోడించి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. భీమ్, సీతారామరాజు కలిసి దొరలపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఆర్ ఆర్ ఆర్ లో చూడవచ్చు. 400కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్, శ్రీయా, అలియా భట్, సముద్ర ఖని వంటి స్టార్స్ నటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios