ప్రపంచ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మూడేళ్ళుకు పైగా మెగా,నందమూరి అభిమానుల నిరీక్షణకు తెరకలేపుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రిమియర్ షోలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇదే తరుణంలో ఫ్యాన్స మధ్య లుకలుకలు కూడా స్టార్ట్  అయ్యాయి. 

ప్రపంచ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మూడేళ్ళుకు పైగా మెగా,నందమూరి అభిమానుల నిరీక్షణకు తెరకలేపుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రిమియర్ షోలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇదే తరుణంలో ఫ్యాన్స మధ్య లుకలుకలు కూడా స్టార్ట్ అయ్యాయి. 

ఈ సినిమాకు రాజమౌళికి చాలా ప్రత్యేకం. ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు టాప్ టాలీవుడ్ స్టార్స్ తో .. ఎవరూ ఊహించని విధంగా భారీమల్టీ స్టారర్ ను తెరకెక్కించారు ఆయన. ఈ మధ్య కాలంలోనే కాదు ఆతరువాత కూడా ఇంత పర్ఫెక్ట్ మల్టీస్టారర్ సినిమా చేయడం ఎవరి వల్లా కాదు. అయితే ఇద్దరు వేరు వేరు స్టార్ హీరోలతో సినిమా చేసినప్పుడు వారి ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక అలికిడి జరగడం కామన్. ఇక ఈసినిమా విషయంలో కూడా అవి తప్పడం లేదు. నందమూరి-మెగా ఫ్యామిలీ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇప్పటికే రుసరుసలు స్టార్ట్ అయ్యాయి. 

పాటలు, మేకింగ్ వీడియోలు ప్రోమోలతో ఆర్ఆర్ఆర్ నిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్ళారు రాజమౌళి. కరోనా వల్ల అభినులు రెండు సార్లు నిరాశకు గురయ్యారు. అభిమనుల కలలను సాకారం చేస్తూ.. మార్చి 25న ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ గా 10000 లకు పైగా స్క్రీన్స్ లో... రికార్డు స్థాయిలో రిలీజ్ అయ్యింది. అయితే ఈసినిమా టికెట్ల విషయంలో మెగా- నందమూరి ఫ్యాన్స్ మధ్య మాత్రం మనస్పర్థలు తప్పలేదు. 

టికెట్ల వషయంలో ఫ్యాన్స్ కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక హీరోకి సంబంధించిన డామినేషన్ కనిపించడంతో మరో హో అభిమానులు హార్ట్ అయ్యారని సమాచారం. చిత్తూరు జిల్లా కుప్పంలో చరణ్, తారక్‌ అభిమానుల మద్య టికెట్ల విషయంలో రచ్చ జరిగినట్టు తెలుస్తోంది. టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నాయకులు పేర్లు ఉండటమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక దీంతో మరో హీరో అభిమానులు కోపంతో ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లను చించేసినట్టు సమాచారం 

ఇలా చాలా చోట్ల ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు మధ్య చిన్న చిన్న మనస్మర్ధలు వచ్చినట్టు సమాచారం. అయితే సినిమా మాత్రం ప్రీమియర్ షో పడినప్పటి నుంచీ సూపర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం.. జక్కన్న ఈసారి మరో అద్భుతాన్ని సృష్టించాడని సినిమా చూసినవారు రివ్యూల్ ఇస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు