దర్శకధీరుడు, జక్కన్న, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ రిలీజ్ కోసం వరల్డ్ వైడ్  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  కాగా తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేశారు.   

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్లీ స్టారర్ మూవీ ‘రౌద్రం, రణం, రుధిరం’(ఆర్ఆర్ఆర్). ఈ మూవీని దర్శకదీరుడు, జక్కన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదివరకూ కరోనా వల్లే పలు మార్లు వాయిదా పడిందీ చిత్రం. జనవరి 7న విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించినా వీలుపడలేదు. ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ పలుమార్లు వాయిదా పడుతూనే వచ్చింది.

Scroll to load tweet…

ఒమిక్రాన్‌ ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడతుందోననే ఆసక్తి ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వారం కిందనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్ ను ఇస్తూ ‘కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రభావంతో కుదిరితే మార్చి 18కి లేదంటే, ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు’ తేలిపారు. దీంతో ప్రేక్షకులకు రిలీజ్ డేట్ పై స్పష్టత లేక కొంత నిరాశకు గురయ్యారు. 

ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేస్తూ అప్డేట్ అందించారు. ‘మార్చి 25’న వరల్డ్ వైడ్ ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు అధికారంగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు రెండేసి డేట్లతో ఖంగారు పెట్టిన మేకర్స్.. ఈ సారి పక్కా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఖుషీ అవుతున్నారు.