RRR’s Postponement:వీళ్లు పండగ చేసుకుంటున్నారు

 కొత్త ఏడాది తొలి రోజే తప్పని పరిస్థితుల్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర టీమ్. ‘బాహుబలి’ సినిమాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. 

RRR Postponement Small Films picked the Sankranthi slot

ఒకరికి మైనస్ అయ్యింది...మరొకరికి ఎప్పుడూ ప్లస్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడటం చిన్న నిర్మాతలకు పండగలా ఉంది. పెద్ద సినిమాల మధ్య తమ సినిమాని రిలీజ్ చేయలేము..సంక్రాంతి పండగకు రాలేము అని బాధలో ఉన్నవారికి ఆర్ ఆర్ ఆర్ వాయిదా వరంలా కనిపించింది. తమ సినిమాలను వరస పెట్టి ప్రకటన చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

 ఎప్పుడెప్పుడా అని సిని అభిమానులు  ఎదురు చూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మరోసారి వాయిదా పడి షాక్ ఇచ్చింది. ఒమిక్రాన్‌ ఎఫెక్ట్ తో దేశంలోని అనేక రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో సినిమా విడుదలని వాయిదా వేయాలని నిర్ణయించింది చిత్రటీమ్. ఆ మేరకు అఫీషియల్ గా సోషల్ మీడియాలో ప్రకటించింది. నెక్ట్స్  ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించలేదు. ఇదివరకూ కరోనా వల్లే పలు మార్లు వాయిదా పడిందీ చిత్రం. జనవరి 7న విడుదల చేయాలని దేశవ్యాప్తంగా  ప్రమోషన్  కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇంకో ఆరు రోజుల్లో  సినిమాని చూస్తామనే ఆశతో ఎదురు చూస్తున్న అభిమానులకి నిరాశే మిగిలింది.  ఈ నేపధ్యంలో చిన్న సినిమాలు కొన్ని వెంటనే తమ సినిమాలు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటనలు చేసేసాయి. మళ్లీ వేరే సినిమాలు ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయకుండా వెంటనే సీన్ లోకి దూకేసాయి.

https://mobile.twitter.com/SitharaEnts/status/1477256595465662466

డీజే టిల్లు, హీరో సినిమాలు సంక్రాంతి స్లాట్ లోకి వచ్చేసాయి. జనవరి 14,15 తేదలను ఫిక్స్ చేస్తూ ప్రకటనలు చేసేసాయి. అలాగే బంగర్రాజు,రౌడీ బోయ్స్ కూడా ఈ సంక్రాంతి స్లాట్ లోకి వస్తాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇవి ప్యాన్ ఇండియా సినిమాలు కాకపోవటం ,భారీ బడ్జెట్ లు లేకపోవటంతో నష్టపోయేది ఉండదనే ఉద్దేశ్యంతో సంక్రాతికి వచ్చేస్తున్నాయి. మరన్ని సినిమాలు కూడా ఈ లిస్ట్ లో చేరబోతున్నట్లు సమాచారం.

ఇక కొత్త ఏడాది తొలి రోజే తప్పని పరిస్థితుల్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర టీమ్. ‘బాహుబలి’ సినిమాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వేసవి సందర్భంగా సినిమాని విడుదల చేస్తారా? పరిస్థితులు అనుకూలిస్తే అంతకుముందే విడుదల చేస్తారా? అనేది చూడాలి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వాయిదాతో సంక్రాంతి బరిలోకి కొత్త సినిమాలు దిగుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios