ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) టైటిల్ తో (NTR)  ఎన్టీఆర్,రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. 

రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా కు సంబంధించిన టీజర్. ట్రైలర్, పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యి సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచేసాయి. ఎన్టీఆర్‌ మరియు రామ్ చరణ్ అభిమాను లు మాత్రమే కాక సినీ లవర్స్ అంతా ముక్త కంఠంతో ఈ ట్రైలర్ అద్బుతంగా ఉందని మెచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్‌లు జోరుగా నడుస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త బయిటకు వచ్చింది. అందులో నిజమెంతో కానీ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటా వార్త... 

ఈ సినిమాని ఓటీటిలో పే ఫర్ వ్యూ మోడ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉందిట. ఎందుకంటే ఓటీటి సంస్ద సైతం భారీ రేటుకు ఈ సినిమాకు కొనుగోలు చేసింది కాబట్టి ఇలా చేయబోతున్నట్లు మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే మరికొంతమంది మరింత ముందుకు వెళ్లి...ఈ సినిమా కరోనా సమస్యతో వాయిదా పడే అవకాసం ఉందని, నైట్ కర్ఫూలతో నార్త్ లో ఇబ్బంది అవుతుందని కాబట్టి ఓటీటిలో రిలీజ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. అయితే అది జరిగే పనికాదు.ఓటీటి రిలీజ్ అదీ పే ఫర్ వ్యూ అనేది ...థియోటర్ రిలీజ్ లేకపోతేనే వర్కవుట్ అవుతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా డైరక్ట్ ఓటీటి రిలీజ్ ఎట్టి పరిస్దితుల్లో పెట్టుకోదు అనేది సుస్పష్టం.

మరో ప్రక్క ఆర్.ఆర్.ఆర్ మూవీ థియేటర్లలో విడుదలైన మూడు నెలల వరకు విడుదల కాదని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. తెలుగు ఓటీటీ హక్కులను జీ5, హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

 ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని హిందీలో సమర్పిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత నిర్మాత జయంతిలాల్ కూడా ఓటిటి రిలీజ్ గురించి స్పందించారు. “RRR సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన 75 నుండి 90 రోజుల తర్వాత ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది. ప్రజలు చాలా కాలం పాటు సినిమా హాళ్లలో దీనిని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాము. అందుకే మేము 30 రోజుల ప్రీమియర్ ని ఎంచుకోలేము” అని జయంతి లాల్ అన్నారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ మూడు నెలల తర్వాత ఓటిటి లో వస్తుందని తేల్చేసారు.

డిజిటల్ హక్కులను తెలుగు ,తమిళ్ అలాగే కన్నడ తో పాటు మలయాళం భాష కోసం కూడా zee5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు మొదటిసారి దక్షిణ భారత దేశంలో ఇంత పెద్ద సినిమాని కొనుగోలు చేయడం పై Zee 5 కే మాత్రమే సాధ్యమైందనీ దక్షిణ భారతదేశంలో తన సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసమే ఈ చిత్రంపై తన ఆశలన్నీ పెట్టుకుందట Zee5. జి ఫైవ్ ఉత్తర భారతదేశంలో బాగా విస్తరించిన ఇప్పటికీ దక్షిణాది భారతదేశంలో పెద్దగా సబ్స్క్రైబర్లు పెద్దగా లేరు. అందుకే ఆర్ ఆర్ ఆర్ భారీ విజయాన్ని అందుకుంటే జి ఫైవ్ దక్షిణ భారతదేశంలో సబ్స్క్రైబర్లు లను ఎక్కువ చేరుకోవడంలో సహాయపడుతుందని సమాచారం. 
Also Read : Sai Dharam Tej: మెగా హీరోను వదలని యాక్సిడెంట్ కేసు..త్వరలో చార్జ్ షీట్..?