Asianet News TeluguAsianet News Telugu

Sai Dharam Tej: మెగా హీరోను వదలని యాక్సిడెంట్ కేసు..త్వరలో చార్జ్ షీట్..?

మెగా హీరో సాయి ధరమ్(Sai Dharam Tej) తేజ్ యాక్సిడెంట్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.  సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవింద్ర ప్రెస్ మీట్ లో సాయితేజ్ యాక్సిడెంట్ కేసు గురించి మాట్లాడారు. ఆల్ రెడీ నోటీసులు ఇచ్చామని..ఇంకా వివరణ రాలేదన్నారు.

 

Sai Dharam Tej Accident case.. police press meet
Author
Hyderabad, First Published Dec 28, 2021, 8:33 AM IST

మెగా మేనల్లుడు.. టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej).. సెప్టెంబర్ 10 యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో.. స్పీడ్ గా వచ్చి బైక్ కంట్రోల్ చేసుకోలేక పడిపోయిన సాయి తేజ్.. చాలా రోజులు అపోలో ఆస్పిటల్ లో ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నారు. సాయి తేజ్  యాక్సిడెంట్ జరగడంతో మెగా హీరోలంతా హస్పిటల్ కు పరుగులు తీశారు. చిరంజీవి, పవన్ కళ్యాన్.. హస్పిటల్ లో ఎప్పటికప్పుడు సాయి ఆరోగ్యపరిస్థితి గురించి డాక్టర్స్ తో మాట్లాడుతూ.. దగ్గరుండి చూసుకున్నారు.

 

దాదాపు 20 రోజులు పైనే ఆస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుని, నెలన్నర పైనే రెస్ట్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సాయి తేజ్ కంప్లీట్ గా కోలుకుని తన సినిమా షూటింగ్స్ లో కూడా జాయిన్ అవుతున్నాడు. తనకు సపోర్ట్ గా నిలిచిన ప్యాన్స్ కు కూడా సాయి తేజ్ ధన్యవాదాలు తెలిపారు.  రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో జరిగిన క్రిస్ మస్ వేడుకల్లో కూడా సందడి చేశారు సాయి తేజ్ .

 

ఈ యాక్సిడెంట జరిగిన టైమ్ లో.. ఈ ఇష్యూపై రకరకాల కోణాల్లో వార్తలు వినిపించాయి. సాయి ధరమ్ తేజ్ ఓవర్ స్పీడ్ వల్లే ఇలా యాక్సిడెంట్ అయ్యిందని..  రోడ్డు మీద ఇసుకు ఉండటం వల్ల బైక్ కంట్రోల్ అవ్వలేదని.. ఇలా చాలా కోణాల్లో పోలీసులు విచారణ చేశారు. చివరిగా సాయి తేజ్ నిర్లక్ష్యం.. ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయ్యిందని.. 91 సీఆర్పీసీ కింద కేస్ బుక్ చేసి  సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కు నోటీసులు కూడా ఇచ్చారు.

 

అయితే ఈ యాక్సిడెంట్ జరిగి మూడు నెలలు కావస్తుంది. ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది. సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవింద్ర ఈ కేసుకు సంబంధించ వివరాలు మీడియాకు తెలియజేశారు. గతంలోనే సాయి తేజ్ కు నోటీసులు ఇచ్చామన్నారు. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరాం..  కాని ఇంత వరకూ.. హీరో దగ్గర నుంచి ఎటువంటి వివరణ రాలేదన్నారు. అందుకే త్వరలో చార్జ్ షీట్ ఫైల్ చేయనున్నట్టు తెలిపారు.

Also Read : Krithi Shetty: మెస్మరైజ్ చేస్తున్న కృతి శెట్టి.. నవ్వుతో కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తుంది.

సైబరాబాద్ లో ఈ ఏడాది జరిగిన నేరాల వివరాలను మీడియా ముందు వెల్లడించారు కమీషనర్. ఈ సదర్భంగా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర జరిగిన సాయి తేజ్ యాక్సిండెంట్ కు సంబంధించిన వివరాలు కూడా మీడియాకు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios