బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి అంతా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్స్ లో సందడి చేయబోతోంది.
బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి అంతా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్స్ లో సందడి చేయబోతోంది. గత నాలుగేళ్లుగా ఆర్ఆర్ఆర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుంది.
రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటించారు. 1920 కాలంలో బ్రిటిష్ నేపథ్యంలో ఈ చిత్రం కల్పిత గాధగా తెరకెక్కింది.
మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోలు షురూ కానున్నాయి. ఈ నేపథ్యం ఆర్ఆర్ఆర్ టికెట్ ధరలు హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ మల్టి ప్లెక్స్ లో అధికారికంగా బుక్ మై షోలో టికెట్ ధర 2100గా నిర్ణయించారు. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మూవీ గా చెప్పొచ్చు.
అలాగే ముంబై నగరంలో కూడా కొన్ని థియేటర్స్ లో టికెట్ ధర 1700 గా బుక్ మై షోలో ఉంది. ఇంత భారీ స్థాయిలో టికెట్ ధరలు ఉండడం ఇదే తొలి సారి. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉన్న క్రేజ్ ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు.
ఇక హైదరాబాద్ నగరంలో బెనిఫిట్ షో టికెట్ ధర 5000 దాటినట్లు తెలుస్తోంది. నార్మల్ షోలకు మల్టిప్లెక్స్ లో రూ 400 పైన టికెట్ ధర చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఎలా ఉన్నా హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి. తొలి రోజు టికెట్ ధర దక్కడం చాలా కష్టమైపోతోంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

