Asianet News TeluguAsianet News Telugu

RRR : కరోనా సిచ్యూయేషన్ మంచిగుంటే మార్చిలోనే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్.. లేదంటే ఏప్రిల్ లో రిలీజ్ అంట..

దర్శకధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌలి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ కోసం ‘బహుబలి కన్ క్లూసన్’ తర్వాత ప్రకటించిన ఈ మూవీ రిలీజ్ కోసం  ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడ్డా మూవీ రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ ను అందించింది. 
 

RRR Movie Release Update, Social Media Post
Author
Hyderabad, First Published Jan 21, 2022, 7:21 PM IST

గతంలోనూ కరోనా వల్లే పలు మార్లు వాయిదా పడిందీ చిత్రం. జనవరి 7న విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించారు. కానీ అప్పుడూ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ వాయిదా వేశారు. ఎట్ట కేళలకు రిలీజ్ మరో సారి తాజా సమాచారాన్ని అందించారు. 

ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మూవీని కరోనా పరిస్థితులు అనుకూలంగా ఉండి, థియేటర్లలో పూర్తి స్థామార్థ్యంతో ప్రేక్షకులను అనుమతిస్తే మార్చిలోనే రిలీజ్ చేయనున్నారు. లేదంటే ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రటకనను విడుదల చేశారు ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్. 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో సినిమా విడుదలని వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కుదిరితే మార్చి 18కి లేదంటే, ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా మరోసారి అఫిషియల్ అనౌన్స్ మెంట్ అందింది. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌‌ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.  ఈలోపు వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి.  RRR చిత్రం మార్చలోనే రిలీజ్ అయితే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటం పక్కా డేట్ ను మేకర్స్ ప్రకటించకపోవడంతో కొంత నిరాశ చెందుతున్నారు. 

 

ఏదేమైనా మార్చి తప్పితే, ఏప్రిల్ లోనైనా మూవీని థియేటర్లలో చూస్తమనే ఆనందాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఈ రెండు తేదీల్లో రిలీజ్ చేస్తారా? లేక కరోనా పరిస్థితులను బట్టి వాయిదా వేస్తారా అనేది చూడాలి. 

‘బాహుబలి’ సినిమాల తర్వాత స్టార్ డైరక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌  హీరోలుగా నటించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు.డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వాయిదాతో సంక్రాంతి బరిలోకి కొత్త సినిమాలు దిగి వాటి జోష్ ను కొనసాగించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios