Asianet News TeluguAsianet News Telugu

RRR OTT Trailer: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల మధ్య సీన్లే హైలైట్‌గా.. ఓటీటీ ఆడియెన్స్ కి అవి బోనస్‌

RRR సినిమా ఓటీటీలో రాబోతుంది. మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా, రెండు నెలల తర్వాత ఓటీటీలో రాబోతుంది. జీ 5లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

rrr movie ott trailer released special treat for ott audience
Author
Hyderabad, First Published May 13, 2022, 12:49 PM IST

రాజమౌళి(Rajamouli) రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) చిత్రం విడుదలై సుమారు రూ.1200(గ్రాస్‌)కోట్లు కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan)లు నటించిన ఈ చిత్రం టాప్‌ ఇండియన్‌ గ్రాసర్‌లో నాల్గో స్థానంలో నిలిచింది. `బాహుబలి`, `దంగల్‌`, `కేజీఎఫ్‌2` తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. తెలుగు ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. రాజమౌళి సృష్టికి ప్రతిరూపం. 

తాజాగా ఈ సినిమా ఓటీటీలో (RRR OTT)రాబోతుంది. మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా, రెండు నెలల తర్వాత ఓటీటీలో రాబోతుంది. జీ 5లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. మే 20న ఎన్టీఆర్‌ బర్త్ డే రోజున డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేయబోతుంది. ఎన్టీఆర్‌ అభిమానులకు మంచి ట్రీట్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇది హిందీ కాకుండా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రాబోతుంది. హిందీలో మాత్రం మరో నెల రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. 

తాజాగా ఓటీటీ ట్రైలర్‌ని(RRR OTT Trailer) విడుదల చేసింది జీ 5 సంస్థ.  స్లో మోషన్‌లో, ఎమోషనల్‌ అంశాలే ప్రధానంగా ఈ ట్రైలర్‌ ఉండటం విశేషం. అయితే ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల మధ్య వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్స్ ని హైలైట్‌ చేశారు. వారిద్దరి మధ్య పోరాటాలు, ఇద్దరి కలిసి చేసే పోరాటాలతోపాటు మిగిలిన అంశాలను కూడా చూపించారు. బ్రిటీష్‌ వారిని కాకుండా కేవలం తెలుగు యాక్టర్స్ పైనే ఫోకస్‌ పెట్టడం మరో విశేషం. దీంతోపాటు థియేటర్‌లో లేని సన్నివేశాలను, డిలీట్‌ చేసిన సన్నివేశాలను కూడా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ట్రైలర్‌ని ఆయా సన్నివేశాలు కనిపిస్తుండటం విశేషం. ఓటీటీ ఫ్యాన్స్‌కివి భోనస్‌గా చెప్పొచ్చు. 

థియేటర్‌లో నిడివి కారణంగా చాలా సన్నివేశాలు తొలగించాల్సి ఉంటాయి. పైగా అప్పటికే సినిమా మూడు గంటలకు పైగా ఉంది. దీంతో చాలా సన్నివేశాలు తొలగించినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు ట్రైలర్‌లో చూస్తే కొన్ని కొత్త సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్‌, చరణ్‌ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్‌, చరణ్‌ హీరోలుగా అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని డివివి దానయ్య సుమారు 450కోట్లతో నిర్మించారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించినప్పటికీ షేర్‌ మాత్రం సగమే ఉంటుందని సమాచారం. అందులోనే ప్రకటించిన కలెక్షన్లలోనూ నిజం లేదని, రెండు వందల కోట్లు ఫేక్‌ అని సమాచారం. చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లకి బ్రేక్‌ ఈవెన్‌ కూడా కాలేదని, నష్టాల్లో ఉన్నారని సమాచారం. అందుకే దీనిపై రాజమౌళిగానీ, నిర్మాతగా ఇప్పటి వరకు స్పందించలేదని, మీడియా ముందుకు రాకపోవడానికి కారణమదే అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios