`ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి మరో సీన్‌ లీక్‌.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మధ్య ఆ సీన్‌ చూస్తే ఇక అంతేనట!

ఇప్పుడు తెలుగులో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`కి సంబంధించి లీక్‌ల బెడద వెంటాడుతుంది. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌  పులితో చేసే పోరాట సన్నివేశం గుస్‌ బమ్స్ క్రియేట్‌ చేస్తుందంటూ కొన్ని ఫోటోలు లీక్‌ అయ్యాయి.

RRR movie one more between ntr and ram charan scene leak viral news  arj

భారీ సినిమాలకు సంబంధించిన సీన్లు, చిన్న క్లిప్‌లు, ఫోటోలు లీక్‌ అవ్వడం తరచూ జరుగుతుండేదే. `బాహుబలి` సినిమా టైమ్‌లో ఇలాంటివి చాలానే జరిగాయి. ఎన్ని లీకైనా `బాహుబలి` ఇండియన్‌ రికార్డులను తిరగరాసింది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `అత్తారింటికి దారేది` సినిమా మొత్తం లీకై వందల మంది దాన్ని చూశారు. కానీ విడుదల తర్వాత భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవల `కేజీఎఫ్‌ 2` టీజర్‌ కూడా లీక్‌ కావడంతో తప్పని పరిస్థితుల్లో యూనిటే దాన్ని అఫీషియల్‌గా రిలీజ్‌ చేసింది. 

అలాగే ఇప్పుడు తెలుగులో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`కి సంబంధించి లీక్‌ల బెడద వెంటాడుతుంది. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌  పులితో చేసే పోరాట సన్నివేశం గుస్‌ బమ్స్ క్రియేట్‌ చేస్తుందంటూ కొన్ని ఫోటోలు లీక్‌ అయ్యాయి. అలాగే ప్రీ ఇంటర్వెల్‌లో రామ్‌చరణ్‌.. బ్రిటీష్‌ వారితో చేసే ఫైట్ సీక్వెన్స్ ఫోటోలు చక్కర్లు కొట్టాయి. అలాగే అండర్‌ వాటర్‌ సన్నివేశం అదిరిపోయేలా ఉంటుందంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో లీకేజ్‌ వార్త చక్కర్లు కొడుతుంది. జైల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ల మధ్య వచ్చే సీన్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉంటుందట. ఈ సీన్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో కాలభైరవ వాయిస్‌తో వచ్చే పాట ఆడియెన్స్ ని కన్నీళ్లు పెట్టిస్తుందని, అంతగా ఎమోషనల్‌కి గురి చేస్తుందని అంటున్నారు. వారెవ్వా ఏం సీన్‌ రా బాబు అనేలా ఉంటుందట. ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే ఇలాంటి సినిమాలకు ఇలాంటి లీకేజ్‌లు ప్లస్‌ అవుతాయే తప్ప నెగటివ్‌ కావు. ఇలాంటి భారీ సీన్లు లీకేజ్‌ అనేది సినిమాపై మరింత అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తుంది. అంచనాలను పెంచుతుంది. ఆడియెన్స్ కి సినిమాని తప్పక చూడాలనే కోరికని పెంచుతుంటాయి. ఇప్పుడు `ఆర్ఆర్‌ఆర్‌` విషయంలో లీకేజ్‌ న్యూస్‌లు అదే చేస్తున్నాయి. సినిమాకవి ప్లస్‌ అవుతున్నాయో తప్ప, సినిమాని ఎక్కడ డ్యామేజ్‌ చేయడం లేదనేది నిజం. 

ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లు, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్‌ 13న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు మొత్తంగా పది భాషల్లో విడుదల చేయబోతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios