RRR Update: `ఆర్‌ఆర్‌ఆర్` మూడో పాట రెడీ.. `జనని` వచ్చేది ఎప్పుడంటే?
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ప్రమోషన్‌లో సాంగ్ తోపాటు `నాటు నాటు` సాంగ్ దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో మరో పాట రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది.
`ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) సినిమా సందడి కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) పాత్రల గ్లింప్స్ వచ్చాయి. అలాగే మేకింగ్ వీడియో వచ్చింది. దీంతోపాటు ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది. అది సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మరోవైపు ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ప్రమోషన్‌లో పాటతోపాటు `నాటు నాటు` సాంగ్ దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో మరో పాట రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది.
`ఆర్‌ఆర్‌ఆర్ సోల్ ఆంథెం`(RRRsoulAnthem).. `జనని`(Janani) అంటూ సాగే పాటని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ నెల 26న పాటని రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సాంగ్‌ని సైతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. చాలా ఎమోషనల్‌గా ఈ పాట ఉండబోతుందని వెల్లడించారు. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్` అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడిగా బ్రిటీష్ నటి ఒలివీయా మోర్రీస్, రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తుంది. అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా రైట్స్ ఇప్పటికే అన్ని భాషల్లో అమ్ముడయ్యాయి. భారీ ఎత్తున పదికిపైగా భాష్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దుబాయ్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్‌కి పలువురు సూపర్ స్టార్లని గెస్ట్ లుగా ఆహ్వానించబోతున్నారట. కనివిని ఎరుగని రీతిలో ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
also read: రాంచరణ్, శంకర్ మూవీకి మైండ్ బ్లోయింగ్ డీల్.. రూ.350 కోట్లకు ఆ హక్కులు సోల్డ్ అవుట్, క్రేజ్ అంటే ఇదీ