రాంచరణ్, శంకర్ మూవీకి మైండ్ బ్లోయింగ్ డీల్.. రూ.350 కోట్లకు ఆ హక్కులు సోల్డ్ అవుట్, క్రేజ్ అంటే ఇదీ
మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిత్రాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం రాంచరణ్ మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిత్రాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం రాంచరణ్ మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ తొలిసారి నటిస్తున్నాడు.
చక్కటి సందేశం, మాస్ ఎలిమెంట్స్ కలిపి శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Shankar, Ram Charan తొలి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారు కాకముందే అదిరిపోయే డీల్ సెట్ అయింది.
బడా సంస్థ జీ నెట్వర్క్ RC15 movie థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుంది. రూ.350 కోట్ల భారీ మొత్తంతో జీ సంస్థ దిల్ రాజుతో డీల్ కుదుర్చుకున్నారు. ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని చిత్రానికి ఇది సెన్సేషనల్ డీల్ అని చెప్పొచ్చు. ఓవర్సీస్ హక్కులు, రీమేక్, మ్యూజిక్ హక్కులు ఇంకా నిర్మాత వద్దే ఉన్నాయి.
ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్ర కథ గురించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. కానీ అవినీతి నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో ట్రైన్ ఎపిసోడ్స్ హైలైట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శంకర్ రైల్వే ట్రాక్ పై కూర్చుని ఉన్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమన్ తొలిసారి శంకర్ చిత్రానికి సంగీతం అందించే బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. రాంచరణ్ ఈ చిత్రంలో స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. జీ సంస్థ రాంచరణ్, శంకర్ మూవీలో పెట్టుబడి కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే దిల్ రాజుతో ఈ డీల్ కుదుర్చుకున్నారు.