ప్రేక్షకుడు ఆశించినదానికి రెట్టింపు ఇవ్వడం రాజమౌళి అలవాటు. ఆయన మార్క్ డైరెక్షన్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో అణువణువునా కనిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సంచనాలు సృష్టించడం ఖాయమనిపిస్తుంది. అయితే ఆర్ ఆర్ ఆర్ లో ఒక విభాగం మాత్రం ఫ్యాన్స్ ని పూర్తి నిరాశకు గురిచేసింది.
రాజమౌళి (Rajamouli)దశాబ్దాలుగా సేమ్ టీమ్ ని మైంటైన్ చేస్తున్నారు. ఆయనకు కలిసొచ్చిన, అనుకూలమైన టీమ్ సభ్యులను ఆయన వదులుకోరు. ఇక రాజమౌళి తన కెరీర్ బిగినింగ్ నుండి అన్నయ్య ఎం ఎం కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటున్నారు. తమ్ముడు నమ్మకాన్ని వమ్ము చేయకుండా కీరవాణి సైతం రాజమౌళి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ వచ్చారు. అయితే సినిమా స్థాయిని బట్టీ కొన్ని విభాగాల్లో సాంకేతిక నిపుణులను మార్చిన రాజమౌళి కీరవాణిని మాత్రం మార్చడం లేదు.
ఇదే ఆయన చిత్రాలకు పెద్ద మైనస్ గా మారుతుంది. బాహుబలి రెండు భాగాలు సూపర్ సక్సెస్. కానీ ఆ రెండు చిత్రాల పాటలు గమనిస్తే అసలు ఏమాత్రం ఆకట్టుకోవు. అవుట్ డేటెడ్ స్వరాలతో కీరవాణి ప్రేక్షకులను హింసించారు. అనేక మంది మూవీ ప్రియులు ఈ విషయంలో బహిరంగంగా తమ అసహనం బయటపెట్టారు. ఆ సినిమా ఏంటి.. ఆ పాటలు ఏంటీ? అంటూ పెదవి విరిచారు. బాహుబలి రెండు పార్ట్స్ భారీ విజయం సాధించడంతో ఈ లోపం మరింతగా ఫోకస్ కాలేదు.
ఆర్ ఆర్ ఆర్ సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదవుతుండగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సాంగ్స్ ఒక్కటంటే ఒక్కటి ప్రేక్షకులలో రిజిస్టర్ కాలేదు. ఒక్క నాటు నాటు సాంగ్ మాత్రం పర్వాలేదు అనిపించుకుంది. పీరియాడిక్ మూవీ అయినప్పటికీ ఇప్పటి ప్రేక్షకుల నాడి, టేస్ట్ ఆధారంగా పాటలు స్వరపరచాలి. ఆర్ ఆర్ ఆర్ సాంగ్స్ ఆ విషయంలో పూర్తిగా విఫలం. అసలు తెలుగువారికే ఈ సాంగ్స్ నచ్చకపోతే బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా నచ్చుతాయో చెప్పండి.
ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోరుకునే రాజమౌళికి ఈ విషయం తెలియనిది కాదు. కానీ బంధుప్రీతి, సెంటిమెంట్ అడ్డురావడంతో కీరవాణిని కాదనకుండా తన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి కూడా కొనసాగిస్తున్నారు. దానికి తోడు తన ప్రాజెక్ట్స్ లో ఏ నిర్ణయమైనా ఆయనదే. హీరో, నిర్మాతల కలుగజేసుకోవడానికి వీలు లేదు. ఆర్ ఆర్ ఆర్ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరుస్తుంటే.. సాంగ్స్ మాత్రం చాలా చప్పగా సాగుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సాంగ్స్ విషయంలో ప్రేక్షకులు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. బాహుబలి తర్వాత కీరవాణి(Keeravani) రిటైర్ అవుతానని ప్రకటించారు. మరి ఆయన నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో తెలియదు.
