గత కొన్ని నెలలుగా ఒకే ప్లేస్ లో జక్కన్న టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మల్టీస్టారర్ RRR హైదరాబాద్ లో వేసిన ఒక స్పెషల్ సెట్ లో రెండు షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సారి ఈ బడా ప్రాజెక్ట్ షూటింగ్ పక్క రాష్ట్రాలకి తరలిపోతోంది. 

40 రోజుల వరకు కలకత్తాలో షూటింగ్ నిర్వహించడానికి నెక్స్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు. గ్యాప్ లేకుండా ఇద్దరు హీరోలు అలాగే మరికొంత మంది నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అయిపోగానే మళ్ళీ యధావిధిగా హైదరాబాద్ షెడ్యూల్ కి చిత్ర యూనిట్ రానుంది. 

డివివి. దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో హీరోయిన్స్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక తారక్ ను బాలీవుడ్ మీడియాకు త్వరలోనే పరిచయం చేయాలనీ జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నారు.