దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omikron)కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తుండగా అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ ఆంక్షలు మొదలైపోయాయి. దీంతో ఆర్ ఆర్ ఆర్ టీం ఆందోళన చెందుతోంది.

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)మూవీని దర్శకుడు రాజమౌళితో పాటు ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. బాహుబలికి మించిన విజయం నమోదు చేయాలని యూనిట్ సంకల్పంతో ఉంది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ మూవీతో బాలీవుడ్ ని మరోసారి కొల్లగొట్టాలని రాజమౌళి ఉత్సాహంగా ఉన్నారు. అయితే రాజమౌళి ఆశలను కరోనా ఆంక్షలు దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. 

కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో పంజా విసురుతుంది. రోజుల వ్యవధిలో వందల సంఖ్యకు దీని బాధితులు చేరారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గత అనుభవాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సూచనలతో ముందస్తు చర్యలు చేపట్టాయి. మహారాష్ట్రలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అక్కడ నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అంటే మహారాష్ట్రలో సెకండ్ షోలు రద్దయ్యాయి. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడవనున్నాయి.

Also read RRR-Komuram Bheemudu Song: కొమురంభీమ్‌ తిరుగుబాటు.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్‌

తెలుగు తర్వాత రాజమౌళి (Rajamouli)సినిమాలకు అతిపెద్ద మార్కెట్ హిందీనే. మహారాష్ట్రలో కరోనా నిబంధలు కారణంగా ఆర్ ఆర్ ఆర్ భారీగా వసూళ్లు కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతుంది. ఇప్పుడే ఒమిక్రాన్ ప్రభావం మొదలుకాగా.. రానున్న పది రోజుల్లో మరిన్ని కేసులు నమోదైన పక్షంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండవచ్చు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ మూవీని జనవరి 7న విడుదల చేయాలని రాజమౌళి గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఐతే మరో వైపు ప్రతికూల పరిస్థితులు సవాళ్లు విసురుతున్నాయి.

మరోవైపు ఏపీలో టికెట్స్ ధరలు విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్స్ నిర్వహణ సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో భారీ బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రానికి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు ప్రాణ సంకటమే. అధికారులు ఓ వైపు ప్రమాణాలు పాటించని థియేటర్స్ సీజ్ చేస్తున్నారు. అధికారుల తనిఖీలకు బయపడి కొందరు యజమానులు స్వచ్ఛందంగా హాళ్లు మూసి వేసుకుంటున్నారు. దీని వలన విడుదలకు అందుబాటులో ఉన్న థియేటర్స్ సంఖ్య తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కోసం ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉన్నప్పటికీ ఈ సవాళ్లు ప్రయోజనాలు దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. 

జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి పత్రాలు చేస్తున్నారు. డివివి దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. కీరవాణి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలియా భట్, అజయ్ దేవ్ గణ్ కీలలు రోల్స్ చేస్తున్నారు. 

Also read రాజమౌళికి బోనీ కపూర్ రిటర్న్ గిఫ్ట్... దసరా లెక్క సంక్రాంతికి సెట్ చేయాలని హీరో అజిత్ తో ప్లాన్