`కొమురం భీముడు.. `సాంగ్‌ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ఈ పాటని విడుదల చేయగా ఇది ఆద్యంతం కట్టిపడేస్తుంది. `కొమురం భీమ్‌ తిరుగుబాటు` నేపథ్యంలో సాగే పాట ఇది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) చిత్రం నుంచి మరో ట్రీట్‌ వచ్చింది. ఈ చిత్రం నుంచి నాల్గో పాట వచ్చింది. `కొమురం భీముడు.. `సాంగ్‌(Komuram Bheemudu Song)ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ఈ పాటని విడుదల చేయగా ఇది ఆద్యంతం కట్టిపడేస్తుంది. `కొమురం భీమ్‌ తిరుగుబాటు` నేపథ్యంలో సాగే పాట ఇది. `భీమా.. నిను గన్న నేలతల్లి.. ఊపిరి పోసిన చెట్టు సేమ.. పేరుపెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. ఇనబడుతుందా?` అంటూ ప్రారంభమైన ఈ పాట ఎన్టీఆర్‌(Ntr) నటిస్తున్న కొమురంభీమ్‌ పాత్ర ఎలివేషన్‌ ప్రధానంగా సాగుతుంది. ఆయన ఘన కీర్తిని చాటి చెప్పే ప్రయత్నం ఈ పాట అని చెప్పొచ్చు. తెలంగాణ జానపదం, అభ్యూదయం భావం మేళవింపుగా ఈ పాట సాగడం విశేషం. ఆద్యంతం కట్టిపడేస్తుంది. అలరిస్తుంది. 

YouTube video player

ఈ పాటని కీరవాణి తనయుడు కాళభైరవ ఆలపించారు. ఆయన పైనే చిత్రీకరించడం విశేషం. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ఆద్యంతం కట్టిపడేశాయి. అలరించాయి. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యాయి. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇక Ntr, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో విడుదల కాబోతుంది. 

Scroll to load tweet…

దీంతో సినిమా కోసం ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరు పెంచింది యూనిట్‌. ఇప్పుడు ముంబయిలో పాగా వేసి, బాలీవుడ్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేసింది. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ, హిందీ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం సౌత్‌ భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టబోతుంది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. పాన్‌ ఇండియా సినిమా కావడం, దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా కావడంతో ఆ కలెక్షన్లని తిరిగి రాబట్టుకునేందుకు జక్కన్న టీమ్‌పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతుంది. ప్రమోషన్స్ పరంగా కొత్త టెక్నిక్స్ ని పాటిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియాభట్‌.. చరణ్‌కి జోడీగా నటిస్తుంది. బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌.. ఎన్టీఆర్‌కి జోడిగా కనిపిస్తుందని టాక్. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా కోసం యావత్‌ దేశం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుండటం విశేషం.