`ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఫ్రీడమ్‌ ఫైటర్స్ కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలను వక్రీకరిస్తున్నారని, చరిత్రని వక్రీకరిస్తూ సినిమా తీస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులే న్యాయపోరాటంచ చేయబోతున్నారు.

రాజమౌళి(Rajamouli) రూపొందించిన భారీ పాన్‌ ఇండియా చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) విడుదలకు ముందు వివాదాల్లో ఇరుక్కుంటుంది. ఎన్టీఆర్‌(NTR), రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్రచి 25న విడుదల కానుంది. ఈ నేపథ్యం గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై వివాదం రాజుకుంది. ఇప్పుడది మరింతగా పెరుగుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఫ్రీడమ్‌ ఫైటర్స్ కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలను వక్రీకరిస్తున్నారని, చరిత్రని వక్రీకరిస్తూ సినిమా తీస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులే న్యాయపోరాటంచ చేయబోతున్నారు.. RRR Controversy.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ చరిత్రని వక్రీకరిస్తున్నారంటూ అల్లూరి సీతారామరాజు మేనల్లుడు గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. గాంధీ ఆయుధాలు పట్టి బ్రిటీష్‌ వాళ్లపై పోరాటం చేశారని, నేతాజీతో కలిసి ఉద్యమాల చేశారా అని సినిమా తీయగలరా అని ప్రశ్నించారు. డబ్బు కోసం చరిత్రని వక్రీకరిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాలో చరిత్ర వక్రీకరణపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. 

అయితే ఆయన ఈ సినిమాలోనే పాత్రల పేర్లని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అల్లూరి, కొమురంభీమ్‌ పేర్లని తొలగించాలంటున్నారు. గతంలోనూ సినిమా చిత్రీకరణ సమయంలోనే స్క్రిప్ట్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అల్లూరి సంఘం ఈ సినిమా చిత్రీకరణపై విమర్శలు గుప్పించింది. డబ్బులు.. కమర్షియల్ అంశాల కోసం ఓ సినిమా పేరుతో తమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని.. అది రాజమౌళి లాంటి దర్శకుడికి అస్సలు తగదని ఆరోపించింది. 

అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టగా.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారు. అదే సమయంలో కొమురం భీమ్ 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ ఇద్దరికి పరిచయం ఉన్నట్లు కానీ, స్నేహం ఉన్నట్లు కానీ చరిత్రలో ఎక్కడా లేదని, అసలు చరిత్రలో లేని విషయాలను సినిమాలో చూపించడం సరైన పద్ధతి కాదంటున్నారు. మరి ఈ వివాదాలను రాజమౌళి టీమ్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి రూపొందించిన భారీ మల్టీస్టారర్‌ చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. నిర్మాత డివివి దానయ్య దాదాపు 450కోట్లతో ఈ సినిమాని నిర్మించారు. అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ ఇందులో హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌, శ్రియా, తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో `ఆర్‌ఆర్‌ఆర్‌` విడుదల కాబోతుంది.