Asianet News TeluguAsianet News Telugu

జపాన్ లో పుంజుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ డే వన్ రికార్డ్స్ కి మించి డే 21 కలెక్షన్స్!

జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ జైత్రయాత కొనసాగుతుంది. ఈ మూవీ వసూళ్లపై ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. డే వన్ కలెక్షన్స్ మించి డే 21 కలెక్షన్స్ ఉన్నాయని మేకర్స్ ట్వీట్ చేశారు. 
 

rrr movie collections in japan day 21 collections higher than day one
Author
First Published Nov 11, 2022, 6:49 PM IST

ఎన్నో ఆశలతో ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ జపాన్ లో విడుదల చేశారు. అక్కడ ఈ మూవీకి ఖచ్చితంగా ఆదరణ లభిస్తుందని నమ్మారు. దాని కోసమే గ్రాండ్ గా ప్రొమోషన్స్ నిర్వహించారు. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ విడుదలకు కొన్ని రోజుల ముందు అక్కడ మకాం వేశారు. స్థానిక మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.   ప్రేక్షకులతో మమేకమై సినిమాను పబ్లిక్ లోకి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీంతో గత భారతీయ సినిమాల రికార్డు ఆర్ ఆర్ ఆర్ చెరిపేస్తుందని మేకర్స్ నమ్మారు. అక్టోబర్ 21న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేశారు.

వారి ఆశలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ 17 రోజులకు  ¥ 185 మిలియన్ వసూళ్లు అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ రన్ సాలిడ్ గానే ఉంది. కాగా ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు పుంజుకున్నట్లు మేకర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. డే 1 వసూళ్ల కంటే డే 21 వసూళ్లు అధికంగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో బాహుబలి 2 రికార్డు ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

 ఏళ్లుగా జపాన్ లో రజినీకాంత్ రికార్డు కొనసాగుతుంది. రజనీకాంత్ ముత్తు ¥ 400 మిలియన్స్ తో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా అక్కడ రికార్డు నెలకొల్పింది. బాహుబలి 2 సైతం ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయింది. మరి ఆర్ ఆర్ ఆర్ ముత్తు రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

ఆర్ ఆర్ ఆర్. మార్చ్ 24న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. వరల్డ్ వైడ్ సత్తా చాటిన ఆర్ ఆర్ ఆర్ ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లతో నయా రికార్డ్స్ సెట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్ లో భారీగా విడుదల చేశారు. రాజమౌళి గత చిత్రం బాహుబలి 2 జపాన్ లో మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రభాస్ కి అక్కడ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. రికార్డు వసూళ్లతో బాహుబలి 2 రెండో ఇండియన్ మూవీగా నిలిచింది. రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్. నిర్మాత డివివి దానయ్య రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అజయ్ దేవ్ గణ్ , శ్రియా, సముద్రఖని కీలక రోల్స్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios