RRR: వార్త నిజమైతే..రాజమౌళి నుంచి ఇది పెద్ద షాకే

 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చెర్రీ కి జోడీగా ఆలియా భట్ - తారక్ సరసన ఒలీవియా మోరీస్ హీరోయిన్స్ గా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో RRR మూవీ విడుదల కానుంది.

RRR movie a bit of shooting left?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'. ఈ చిత్రం రిలీజ్ కోసం,  ట్రైలర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. అయితే అదే సమయంలో మీడియాలో మరో వార్త ప్రచారం అవుతోంది. అదే నిజమైతే పెద్ద షాకే. 

అందేంటంటే ఈ చిత్రం షూటింగ్  మొత్తం కంప్లీట్ అయిందని చిత్ర టీమ్ ప్రకటించినా ఇంకా కొంత షూటింగ్ మిగిలే ఉందనేది ఆ వార్త సారాంశం. రామ్ చరణ్ - అలియా భట్ లపై ప్లాన్ చేసిన ఓ పాటను చిత్రీకరించాల్సి ఉందని.. డిసెంబర్ రెండో వారంలో షూట్ చేయాలని ప్లాన్  చేస్తున్నారని అంటున్నారు.షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయిందని అందరూ భావిస్తుండగా.. ఇప్పుడు తాజాగా ఈ రూమర్ ఊహించని షాక్ కు గురిచేస్తోంది. ఇదే కనుక నిజమైతే ఓవైపు పాట షూటింగ్ మరోవైపు ప్రమోషన్స్ ఏకకాలంలో నిర్వహించడమంటే RRR టీమ్ కి కాస్త కష్టమైన పనే అని అంటున్నారు.  అయితే  ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక RRR ట్రైలర్ ను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తామని రాజమౌళి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 3వ తేదీన ట్రైలర్ ను ఆవిష్కరించనున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది. 'బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. ప్రశాంతత లేదు.. ఇక సెలబ్రేషన్స్ ప్రారంభించండి' అని పేర్కొంటూ మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అజయ్ దేవగన్ - అలియా భట్ లతో కూడిన 'ఆర్.ఆర్.ఆర్' పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉంది.  ఇప్పటికే విడుదలైన టీజర్లు - మూడు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ఆత్మగా పేర్కొంటున్న 'జనని' గీతం భావోద్వేగానికి గురి చేసింది.  'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చెర్రీ కి జోడీగా ఆలియా భట్ - తారక్ సరసన ఒలీవియా మోరీస్ హీరోయిన్స్ గా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో RRR మూవీ విడుదల కానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios