దర్శకుడు రాజమౌళి 300కోట్లకు పైగా ఖర్చు చేసి సినిమా తీస్తున్నాడు అంటే ముందే రిలీజ్ డేట్ పై కూడా స్కెచ్ లు వేసుకొని మరి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియన్ సినిమా కాబట్టి అన్ని భాషల్లో సక్సెస్ అవ్వాలని ఆయన పడుతున్న తపనకు మరో సినిమాతో పోటీ ఉండకూడదని అనుకుంటున్నారు. 

అందుకే ఏడాది ముందే పెద్ద సినిమాలు లేని సమయం చూసి 2020 జూన్ 20కి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు. కానీ సినిమాకి పోటీగా అదేతేదికి కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో అక్షయ్ కుమార్ తో రూపొందుతున్న మరో బడా సినిమా సిద్ధమవుతోంది. స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. 

అయితే ఈ విషయంపై రాజమౌళి కరణ్ జోహార్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా డేట్స్ క్లాష్ అవ్వకుండా ఉండడానికి జక్కన్న తన సైడ్ నుంచి రిక్వెస్ట్ సిగ్నల్ పంపినట్లు తెలుస్తోంది. ఎలాగూ హిందీ రైట్స్ కరణ్ జోహార్ చేతిలోనే ఉంటాయి కాబట్టి RRR లాంటి బడా మల్టీస్టారర్ కోసం అక్షయ్ సినిమాను వాయిదా వేయడానికి పెద్దగా ఆలోచించకపోవచ్చు. మరి ఆ చర్చలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. .