దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.

సినిమాలో రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన ముందుగా ఓ హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేశారు. అయితే ఆమె కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో ఆ క్యారెక్టర్ ని మార్చేశారని, ఫారెన్ అమ్మాయిని తీసుకోవాల్సిన అవసరం లేదని కొన్ని వార్తలు వినిపించాయి. 

కానీ చిత్రబృందం మాత్రం మరో హాలీవుడ్ నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఓ ఫారెన్ నటిని తీసుకున్నట్లు సమాచారం. అమెరికన్ నటి, గాయని ఎమ్మారాబర్ట్స్ ని 'RRR'లో హీరోయిన్ గా ఎంపిక చేశారట.

ఇప్పటికే ఎమ్మారాబర్ట్స్ పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తొలిసారి ఆమె ఓ ఇండియన్ సినిమాలో నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ సరికొత్త గెటప్పుల్లో ఈ సినిమాలో కనిపించనున్నారు.