Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ..!
మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు షురూ అయ్యాయి. ఆయన లేటెస్ట్ మూవీ సెట్స్ లో యూనిట్ ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కియారా అద్వానీ సైతం పాల్గొన్నారు.

రామ్ చరణ్ కి ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన అరుదైన విజయాలు అందుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఏకంగా ఆస్కార్ దక్కింది. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కైవసం చేసుకుంది. ఇక అమెరికాలో రామ్ చరణ్ కి దక్కిన గౌరవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఈవెంట్ కి అతిథిగా ఆహ్వానించబడ్డారు. హెచ్ సీ ఏ రామ్ చరణ్ ని స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించింది.
ఆయన గ్లోబల్ స్టార్ గా అవతరించారు. దీంతో మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు మొదలైపోయాయి. ఆర్సీ 15 సెట్స్ లో యూనిట్ ఆయన చేత కేక్ కట్ చేయించారు. దిల్ రాజు, ప్రభుదేవా, దర్శకుడు శంకర్, కియారా అద్వానీతో పాటు యూనిట్ మెంబర్స్ చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
కియారా అద్వానీ-రామ్ చరణ్ మీద ఓ సాంగ్ షూట్ చేశారు. ఆ పాట చిత్రీకరణ పూర్తయిన అనంతరం చరణ్ బర్త్ డే జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో 50వ చిత్రంగా ఆర్సీ 15 తెరకెక్కుతుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పొలిటీషియన్ గా, ఎన్నికల అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో ఆయన కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఆర్సీ 15 చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అద్వానీతో పాటు అంజలి మరొక హీరోయిన్.