సారాంశం


ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైంది. 


అందరూ ఊహించినట్లుగానే ఆర్ఆర్ఆర్ అప్పుడే రికార్డుల ఊచకోత మొదలుపెట్టింది. నిన్న మార్నింగ్ షో నుంచి టాక్ కాస్త తేడాగానే వినపడుతోంది. సోషల్ మీడియాలోనూ నెగిటివ్ ప్రచారం బాగా జరుగుతోంది. ఈ సినిమా కలెక్షన్స్  బాహుబలి రేంజ్ లో లేకపోయినప్పటికీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఒక్కసారైనా థియేటర్లలో చూడాలని టెంప్ట్ చేసేలా ఉండటంతో ప్రేక్షకులు టికెట్ల కోసం పరుగులు పెడుతున్నారు. ధరల విషయంలో విపరీతమైన హైక్ ఇబ్బందిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ గ్రాండియర్ కి అంత మొత్తాన్ని ఇవ్వొచ్చనే రీతిలో ఆడియన్స్ ముందే ప్రిపేర్ కావడంతో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని చోట్ల ఆల్ టైం రికార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ వీకెండ్ ఈ రోజు రేపూ ఇదే ప్రభంజనాన్ని కొనసాగించడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చేసారు. ఈ క్రమంలో ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

RRR ఫస్ట్ డే  కలెక్షన్స్ (ఏరియావైజ్)

నైజాం  23.31కోట్లు

సీడెడ్  16.90కోట్లు

వైజాగ్ ( ఉత్తరాంధ్ర ) 7.40కోట్లు

ఈస్ట్ గోదావరి 5.37కోట్లు

వెస్ట్ గోదావరి  5.93కోట్లు

కృష్ణా   4.20కోట్లు

గుంటూరు  7.80కోట్లు

నెల్లూరు  3.01కోట్లు

ఆంద్రా &తెలంగాణా రెండు రాష్ట్రాలలో ...  73.92కోట్లు

 బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ లెవల్ లో  దూసుకుపోతోంది, యంగ్ టైగర్ ఎన్టీఆర్,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పై తెలుగు లో అయితే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రిలీజ్ రోజు సెకండాఫ్ బాగోలేదోని డివైడ్ టాక్  స్ప్రెడ్ అయినా కలెక్షన్స్ హోరు, జోరు మాత్రం ఆగలేదు.
 
మూడు వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను ఆపే సినిమా లేక పోవడంతో కచ్చితంగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.  దాంతో మొదటి రోజే దాదాపు ఇరవై నాలుగు కోట్లు దాకా తెచ్చుకోవటంతో ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ వస్తుంది లెక్కలు వేస్తున్నారు.